Shah Rukh Khan Son: ముంబై డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్.. బాలీవుడ్‌ బడా హీరో కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌

|

Oct 03, 2021 | 12:09 PM

ముంబై డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్‌ బడా హీరో కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అవడం దుమారం రేపుతోంది. ఆ స్టార్‌ సెలబ్రిటీ చుట్టూనే తిరుగుతోంది ఈ డ్రగ్స్‌ కేసు.

Shah Rukh Khan Son: ముంబై డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్.. బాలీవుడ్‌ బడా హీరో కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌
Aryan Khan
Follow us on

ముంబై డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్‌ బడా హీరో కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అవడం దుమారం రేపుతోంది. ఆ స్టార్‌ సెలబ్రిటీ చుట్టూనే తిరుగుతోంది ఈ డ్రగ్స్‌ కేసు. సముద్రం మధ్యలో క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్యన్‌ఖాన్‌ను ప్రశ్నిస్తున్నారు NCB అధికారులు. ఆ క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో దొరికిపోయాడు ఆర్యన్‌ఖాన్‌.  ఆర్యన్‌ఖాన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌, నుపూర్‌ సారిక, ఇస్మీత్ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రాను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మీకు డ్రగ్స్‌ ఎవరు సప్లై చేశారు..? ఎక్కడి నుంచి వచ్చాయి..? అన్న కోణంలో విచారిస్తున్నారు.

మరోవైపు తీర ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేశారు ఎన్సీబీ అధికారులు. ఈ రైడ్స్‌లో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో మరో భారీ డ్రగ్‌ ముఠా గుట్టు రట్టయింది. అంథేరీలో 5 కోట్ల రూపాయల విలువైన ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎన్సీబీ అధికారులు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా ఆస్ట్రేలియాకు తరలించే ప్రయత్నం చేసింది ఈ గ్యాంగ్‌. అయితే ఈ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరో కొత్త కోణం వెలుగులోకొచ్చింది.

హైదరాబాద్‌ లింకులు బయటపడ్డాయి. ఈ ఎఫిడ్రిన్‌ హైదరాబాద్‌ కేంద్రంగా తయారైనట్టు తేల్చారు ఎన్సీబీ అధికారులు. హైదరాబాద్‌ నుంచి విదేశాలకు ఈ డ్రగ్స్‌ తరలిస్తున్నట్టు గుర్తించారు. మాదక ద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడ ఎఫిడ్రిన్‌గా మార్చి గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తోంది డ్రగ్స్ ముఠా. 50వేల రూపాయల విలువజేసే ఎఫిడ్రిన్‌..ఆస్ట్రేలియాలో 5 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం.

ఇక క్రూయిజ్‌లో మొత్తం 10మందిని అరెస్ట్‌ చేశారు ఎన్సీబీ అధికారులు. వారిలో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. క్రూయిజ్‌లో హై ప్రోఫైల్‌ పార్టీ ఏర్పాటుచేసిన నిర్వాహకులకూ సమన్లు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Maharashtra NCB Raid: వీకెండ్‌ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో పుత్రరత్నం..