ఆర్టికల్ 370 రద్దుపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. లండన్ ఉన్న ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా ట్వీట్ చేశారు. చరిత్రలో ఈ రోజు ఎన్నటికీ మరిచిపోనిదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను నాశనం చేస్తున్న ఆర్డికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక కశ్మీరీగా ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు అనుపమ్ ధన్యవాదాలు తెలిపారు.
#WATCH Anupam Kher in New York: Today marks a remarkable day in the history of our great nation India. The most damaging #Article370 has been abolished by Modi govt from J&K. pic.twitter.com/em2C8Ys6Qi
— ANI (@ANI) August 5, 2019