Russia Ukraine War: మూడు వారాల తర్వాత స్వదేశానికి చేరుకోనున్న న‌వీన్ మృత‌దేహం.. ఎప్పుడంటే..?

|

Mar 19, 2022 | 7:12 AM

Body of Indian student: ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న యుద్ధంలో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్‌ మృతదేహం 20 రోజుల అనంతరం సోమవారం బెంగళూరుకు చేరుకోనుంది. అయితే,

Russia Ukraine War: మూడు వారాల తర్వాత స్వదేశానికి చేరుకోనున్న న‌వీన్ మృత‌దేహం.. ఎప్పుడంటే..?
Naveen
Follow us on

Body of Indian student: ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న యుద్ధంలో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్‌ మృతదేహం 20 రోజుల అనంతరం సోమవారం బెంగళూరుకు చేరుకోనుంది. అయితే, మొదట ఆదివారం చేరుతుందని కర్ణాటక సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఈ విష‌యాన్ని తెలిపారు. ఆ తర్వాత దానిని సరిచేశారు. నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం బెంగళూరు విమానాశ్రయానికి ఉదయం 3 గంటలకు చేరుకుంటుందని స్పష్టం చేశారు. ఆదివారం కాదని.. సోమవారం వస్తుందని కుటుంబసభ్యులకు తెలియజేసినట్లు వెల్లడించారు.

ఉక్రెయిన్ న‌గ‌రం ఖ‌ర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చివరి సంవత్సరం చ‌దువుతున్న నవీన్ మార్చి 1న ర‌ష్యా దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత తన కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబసభ్యులు కోరడంతో.. ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. నవీన్‌ తండ్రి కూడా.. తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు.

దాదాపు 19 రోజుల నుంచి నవీన్‌ కుటుంబ సభ్యులు అతడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. యుద్ధం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో న‌వీన్ మృత‌దేహం త‌ర‌లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.

వైద్య విద్యార్థి నవీన్ జ్ఞానగౌడర్ మార్చి 1న యుద్ధం జరుగుతున్న సమయంలో ఖర్కీవ్‌లోని తాను ఉన్న ప్రాంతం నుంచి దుకాణానికి వెళ్లగా.. రష్యా జరిపిన షెల్ దాడిలో మరణించాడు.

Also Read;

The Kashmir Files : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్

Horoscope Today: ఈ రాశివారు గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.. ఆకస్మిక ప్రయాణాలు