తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించగా.. మరో తొమ్మిది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ముప్పై మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగానే ఈ పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. కాగా.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.