ఢిల్లీ.. ఫ్యాక్టరీ బిల్డింగ్ కుప్ప కూలి.. శిథిలాల కింద ..

|

Jan 02, 2020 | 12:26 PM

ఢిల్లీలో ఈ మధ్య వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలో గల ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి.. ఒక్కఉదుటున మంటలు రేగాయి. దీంతో ఈ భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఒక కార్మికుడు మాత్రం చిక్కుకుపోయినట్టు ఆ తరువాత అధికారవర్గాలు తెలిపాయి. మంటలు ఆర్పడానికి యత్నించిన అగ్నిమాపక సిబ్బందిలో ఇద్దరిని , ఓ వర్కర్ ను […]

ఢిల్లీ.. ఫ్యాక్టరీ బిల్డింగ్ కుప్ప కూలి.. శిథిలాల కింద ..
Follow us on

ఢిల్లీలో ఈ మధ్య వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలో గల ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి.. ఒక్కఉదుటున మంటలు రేగాయి. దీంతో ఈ భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఒక కార్మికుడు మాత్రం చిక్కుకుపోయినట్టు ఆ తరువాత అధికారవర్గాలు తెలిపాయి. మంటలు ఆర్పడానికి యత్నించిన అగ్నిమాపక సిబ్బందిలో ఇద్దరిని , ఓ వర్కర్ ను అతికష్టం మీద రక్షించారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. భారీగా మంటలు రేగడంతో వాటిని ఆర్పేందుకు సుమారు 35 ఫైరింజన్లు శ్రమించాయి. ఈ ఫ్యాక్టరీలోని బ్యాటరీలు హీటెక్కిపోవడంతోనే పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. బ్యాటరీల నుంచి వచ్ఛే పొగ ప్రమాదకరమైనదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మంటలు, నల్లని దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా భీతావహమైంది. హస్తినలో ఈ మధ్య వరుసగా జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇది మూడవది.