India Pakistan War: జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత.. డ్రోన్ దాడులకు పాక్ యత్నం

పాకిస్తాన్ వక్రబుద్ది మారలేదు. చీకటి కాగానే మరోసారి డ్రోన్ దాడులకు తెగబడింది. వరుసగా రెండో రోజు డ్రోన్‌ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబ, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాల్పడినట్టు జాతీయ మీడియా పేర్కొంది. వాయుసేన సమర్ధంగా తిప్పికొట్టినట్టు తెలిపింది. ఇప్పటికే..

India Pakistan War: జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత.. డ్రోన్ దాడులకు పాక్ యత్నం
Jk Blackout

Updated on: May 09, 2025 | 9:43 PM

పాకిస్తాన్ వక్రబుద్ది మారలేదు. చీకటి కాగానే మరోసారి డ్రోన్ దాడులకు తెగబడింది. వరుసగా రెండో రోజు డ్రోన్‌ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబ, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాల్పడినట్టు జాతీయ మీడియా పేర్కొంది. వాయుసేన సమర్ధంగా తిప్పికొట్టినట్టు తెలిపింది. ఇప్పటికే జైసల్మేర్, అంబాలా, పంచకుల ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. మరోవైపు దాడులను ఉపేక్షించేది లేదని భారత్ ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్‌లో పూర్తిగా బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. నగరం మొత్తం సైరన్ల మోత వినిపించిందని తెలిపారు. తాను ఉన్న ప్రాంతంలో ఫిరంగి పేలిన శబ్దం, పేలుళ్లు వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. జమ్మూ ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఆయన కోరారు. రాబోయే కొన్ని గంటల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అలాగే వదంతులను నమ్మొద్దని, నిరాదర వార్తలు ప్రచారం చేయొద్దన్నారు.