AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LK Advani: లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య పర్యటన ఖరారు.. రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటారన్న వీహెచ్‌పీ

రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహించిన సీనియర్ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలోక్ కుమార్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకుడు కృష్ణ గోపాల్‌తో కలిసి అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు.

LK Advani: లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య పర్యటన ఖరారు.. రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటారన్న వీహెచ్‌పీ
Lk Advani
Balaraju Goud
|

Updated on: Jan 12, 2024 | 12:03 PM

Share

రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహించిన సీనియర్ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలోక్ కుమార్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకుడు కృష్ణ గోపాల్‌తో కలిసి అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆహ్వానించారు.

అద్వానీ వస్తానని చెప్పారని, అవసరమైతే, అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు VHP వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే, దీక్షలో ప్రముఖ పార్టీ నాయకుడు మురళీ మనోహర్ జోషి పాల్గొనడం ఇంకా నిర్ణయించుకోలేదు. అయోధ్యలో జరిగే కార్యక్రమానికి జోషి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారన్నారు. జోషి-అద్వానీల ఆరోగ్యం దృష్ట్యా, వారు కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నదీ ఇంకా స్పష్టత లేదు. బీజేపీ వ్యవస్థాపక సభ్యులైన ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో కలిసి 1980 – 1990ల ప్రారంభంలో రామజన్మభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే అద్వానీ, జోషి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా దీక్షా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని రామమందిరం ట్రస్ట్ గత నెలలో పేర్కొంది.

అయోధ్యలో ఆహ్వానితుల వివరణాత్మక జాబితాను అందజేస్తూ, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరులతో మాట్లాడారు. “ఇద్దరూ వారి వయస్సును దృష్టిలో ఉంచుకుని, వారు రావద్దని అభ్యర్థించాం. దీనిని ఇద్దరూ అంగీకరించారు.” అని అన్న చంపత్ రాయ్. రాయ్ ప్రకటన వివాదానికి తెరలేపడంతో, మరుసటి రోజు VHP వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీక్షా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అద్వానీ, జోషిని ఆహ్వానించినట్లు తెలిపారు. అద్వానీ, జోషి ఇద్దరూ జనవరి 22న అయోధ్యలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు.

”అందరికీ ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లుగానే ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించాం. ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర అన్ని పార్టీల అధ్యక్షులను కూడా అభ్యర్థించాం. ఈ సందర్భం హిందువులందరికీ పండుగ అని మేము నమ్ముతున్నాము. అదే సమయంలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనబోమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.” అని అలోక్ కుమార్ అన్నారు. అయోధ్య పర్యటన సందర్భంగా అద్వానీకి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు చేస్తామని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు.

శతాబ్దానికి పైగా నాటి గుడి-మసీదు వివాదాన్ని పరిష్కరిస్తూ 2019లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణాన్ని సమర్థించిన న్యాయస్థానం మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని కనుగొనాలని తీర్పునిచ్చింది. ఇదిలావుంటే, జనవరి 15 నుంచి అయోధ్యలో కార్యక్రమం ప్రారంభం కానుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఆ తర్వాత రామమందిరం భక్తుల కోసం తెరవడం జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…