BJP: వసుంధర రాజే, శివరాజ్‌ల భవితవ్యం ఏంటి.? జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ విషయమై జేపీ నడ్డా మాట్లాడుతూ.. ముగ్గురు మాజీ సీఎంలు పార్టీ సీనియర్ నాయకులన్న జేపీ వారి స్థాయిలకు అనుగుణంగా వారి విధులు ఉంటాయన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించామన్నారు. సీనియర్ పదవులకే కాకుండా అట్టడుగు స్థాయిలో కూడా నాయకుడిని ఎంపిక చేసేందుకు తమ పార్టీ విస్తృతంగా పరిశోధన చేస్తుందని నడ్డా చెప్పుకొచ్చారు...

BJP: వసుంధర రాజే, శివరాజ్‌ల భవితవ్యం ఏంటి.? జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు..
JP Nadda

Updated on: Dec 14, 2023 | 2:19 PM

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త భారతీయ జనతా పార్టీ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్‌ను, రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మను, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణు సాయిని పార్టీ ముఖ్యమంత్రి చేసింది. మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖాల ఎన్నిక తర్వాత పాత నేతలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన భవిష్యత్ పాత్ర గురించి, పార్టీ ద్వారా కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ గురించి వివరించారు.

ఈ విషయమై జేపీ నడ్డా మాట్లాడుతూ.. ముగ్గురు మాజీ సీఎంలు పార్టీ సీనియర్ నాయకులన్న జేపీ వారి స్థాయిలకు అనుగుణంగా వారి విధులు ఉంటాయన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించామన్నారు. సీనియర్ పదవులకే కాకుండా అట్టడుగు స్థాయిలో కూడా నాయకుడిని ఎంపిక చేసేందుకు తమ పార్టీ విస్తృతంగా పరిశోధన చేస్తుందని నడ్డా చెప్పుకొచ్చారు. కార్యకర్తలందరినీ పార్టీ నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. వారి బ్యాగ్రౌండ్‌తో పాటు వారు చేసే ప్రతీ పనిపై తమకు అవగాహన ఉంటుందన్నారు. ఇందు కోసం తమ పార్టీకి భారీ డేటా బ్యాంక్‌ ఉందన్న జేపీ, ఈ డేటాను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తామని చెప్పుకొచ్చారు.

ఇక ముఖ్యమంత్రి ఎంపిక విషయమై నడ్డా మాట్లాడుతూ.. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచే ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చిన వెంటనే.. తమ నాయకుడు ఎవరనే దానిపై ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఇది ఒక నిరంతర ప్రక్రియన్న జేపీ నడ్డా… ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ట్రెండ్ జోరందుకుందన్నారు. ఈ విషయమై లోతైన సంప్రదింపులు ఉన్నాయన్న జేపీ.. కేబినెట్ ఎంపికకు కూడా ఇదే వర్తిస్తుందన్నారు.

ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో 163, రాజస్థాన్‌లో 115, ఛత్తీస్‌గఢ్‌లో 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..