Lok Sabha: సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే.. బీజేపీ ఎంపీల ఆందోళనలతో హోరెత్తిన లోక్‌ సభ..

Lok Sabha: లోక్‌ సభా సమావేశాల్లో బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌పై చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజిర్‌ రాష్ట్రపతిని అవమానపరిచారంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ...

Lok Sabha: సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే.. బీజేపీ ఎంపీల ఆందోళనలతో హోరెత్తిన లోక్‌ సభ..

Updated on: Jul 28, 2022 | 1:54 PM

Lok Sabha: లోక్‌ సభా సమావేశాల్లో బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌పై చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజిర్‌ రాష్ట్రపతిని అవమానపరిచారంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంట్‌ లోపల, బయట ఆందోళన చేపట్టారు. గురువారం సభ ప్రారంభంకాగానే కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ.. బీజేపీ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. రాష్ట్రపతిని కాంగ్రెస్‌ అవమానించారని… సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్‌ చేశారు. బీజేపీ నేల ఆందోళనతో సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.

లోక్‌ సభలో నిరసనలు హోరెత్తగా, అటు రాజ్యసభలోనూ సేమ్‌ సీన్‌ కనిపించింది. కాంగ్రెస్‌ వైఖరిపై అధికార పార్టీ మండిపడింది. సోనియాగాంధీ రాష్ట్రపతికి, జాతికి క్షమాపణలు చెప్పాలని మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌ చేశారు. అధీర్‌ రంజన్‌ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను కాసేపు వాయిదా వేశారు. అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభమైనా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో సోనియా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌ రహదారిపై నిరసనకు దిగారు. సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లు తోసుకుని గాంధీభవన్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..