Anurag Thakur: అలా చేస్తే కన్నీరు కార్చడానికి కూడా ఎవరూ మిగలరు.. పాకిస్తాన్‌కు అనురాగ్ ఠాకూర్ వార్నింగ్

మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే.. దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని.. వారు భారత్ పై చెడు దృష్టితో కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకేస్తామంటూ పేర్కొన్నారు.

Anurag Thakur: అలా చేస్తే కన్నీరు కార్చడానికి కూడా ఎవరూ మిగలరు.. పాకిస్తాన్‌కు అనురాగ్ ఠాకూర్ వార్నింగ్
BJP MP Anurag Thakur

Updated on: May 22, 2025 | 7:05 PM

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది.. సింధు జలాల ఒప్పందం రద్దు సహా.. ఆపరేషన్‌ సింధూర్‌ తో ఉగ్రస్థావరాలను మట్టుపెట్టడం సహా పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టింది. భారత త్రివిధ దళాలు పక్కా వ్యూహంతో ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టాయి. మే 7, 2025న తెల్లవారుజామున 25 నిమిషాల వ్యవధిలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌.. పాకిస్థాన్‌ వెన్నులో వణుకు పుట్టించింది. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు ఒప్పుకున్నాయి.. మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే.. దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని.. వారు భారత్ పై చెడు దృష్టితో కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకేస్తామంటూ పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ పాంట సాహిబ్ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే.. వీడియో చూడండి..

“మీరు మీ ఉగ్రవాదుల వెనుక దాక్కుని భారతదేశంతో పోరాడాలనుకుంటున్నారని నేను పాకిస్తాన్‌కు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం – పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగినప్పుడల్లా, అది 1965 యుద్ధం లేదా 1971 యుద్ధం లేదా కార్గిల్ యుద్ధం అయినా.. భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించింది. పాకిస్తాన్ భారతదేశంపై చెడు దృష్టి పెడితే, వారి కళ్ళు పీకివేయబడతాయని ఆపరేషన్ సిందూర్‌తో చూపించాం.. ప్రస్తుతం, మేము ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసాము, వారి వైమానిక స్థావరాలను దెబ్బతీసాము.. వైమానిక స్థావరాలపై దాడి చేసాము.. పాకిస్తాన్‌ను హెచ్చరిస్తున్నాను, వారు తదుపరిసారి భారతదేశంపై ఉగ్రవాద దాడి చేయడానికి ప్రయత్నిస్తే, అంత్యక్రియలలో వారి మృతదేహాలను భుజాన వేసుకోని పోవడానికి లేదా ఆ అంత్యక్రియలలో కన్నీరు కార్చడానికి ఎవరూ ఉండరు.” అంటూ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

మరిన్నా జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..