బీజేపీకి బిగ్ షాక్.. అనర్హుడిగా మారిన ఎమ్మెల్యే

| Edited By: Pardhasaradhi Peri

Nov 03, 2019 | 3:51 PM

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా మారాడు. దీనికి కారణం ఆయన ఓ కేసులో దోషిగా తేలడం. వివరాల్లోకి వెళితే.. పవాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. గతంలో ఉన్న ఓ పాత కేసు విషయంలో ఆయనను స్పెషల్ కోర్టు దోషిగా పేర్కొంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఈ విషయాన్ని తెలియజేస్తూ, కోర్టు తీర్పు నేపథ్యంలో […]

బీజేపీకి బిగ్ షాక్.. అనర్హుడిగా మారిన ఎమ్మెల్యే
Follow us on

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా మారాడు. దీనికి కారణం ఆయన ఓ కేసులో దోషిగా తేలడం. వివరాల్లోకి వెళితే.. పవాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. గతంలో ఉన్న ఓ పాత కేసు విషయంలో ఆయనను స్పెషల్ కోర్టు దోషిగా పేర్కొంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ఈ విషయాన్ని తెలియజేస్తూ, కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దయిందని తెలిపారు. అంతేకాదు రాష్ట్ర అసెంబ్లీలో ఒక సీటు కూడా ఖాళీ అయిన విషయాన్ని.. ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

కాగా, ప్రహ్లాద్ లోథి అసెంబ్లీ సభ్యత్వం రద్దుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోథిని అనర్హుడిగా ప్రకటిస్తూ.. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడం ప్రతీకార చర్యేనని, ఉన్నత స్థానంలో ఉండాల్సిన స్పీకర్.. పూర్తిగా కాంగ్రెస్ మనిషిగా వ్యవహరించారని రాకేష్ సింగ్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామన్నారు. అయితే 2014లో పన్నా జిల్లా తహసిల్దార్ ఆర్‌కే వర్మపై దాడికి సంబంధించిన కేసులో.. లోథితో సహా 12 మందిని స్పెషల్ కోర్టు దోషులుగా పేర్కొంటూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.