ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం… మరో 12 మంది కూడా మంత్రులుగా ప్రమాణం

| Edited By: Phani CH

Jul 04, 2021 | 9:32 PM

ఉత్తరాఖండ్ 11 వ ముఖ్యమంత్రిగా 45 ఏళ్ళ పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణం చేయించారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం... మరో 12 మంది కూడా మంత్రులుగా ప్రమాణం
Pushkar Singh Dhami
Follow us on

ఉత్తరాఖండ్ 11 వ ముఖ్యమంత్రిగా 45 ఏళ్ళ పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణం చేయించారు. కేవలం నాలుగు నెలల్లో ధామి ఈ రాష్ట్ర మూడో సీఎం అయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సత్పాల్ మహారాజ్, హరన్ సింగ్ రావత్, యశ్ పాల్ ఆర్య, అరవింద్ పాండే వంటి వారితో సహా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన ధామి…రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనకు తెలుసునని..కోవిద్ పాండమిక్ వారి మనుగడపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వారి పరిస్థితి మెరుగు పడేలా చూస్తానని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన కొందరు బీజేపీ సీనియర్ నేతలను కలిశారు. వీరిలో కొంతమంది సీఎంగా ఈయన ఎంపిక పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. కానీ వీరు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

మొదట వీరంతా దీనికి గైర్ హాజరు కావచ్చునని వార్తలు వచ్చాయి. అయితే ఎవరిలోనూ అసంతృప్తి అంటూ లేదని పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ విధమైన వార్తలను నమ్మరాదన్నారు.తాను అందరినీ కలుపుకుని పోతానన్నారు. అటు-ఈయనను ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా అభినందిస్తూ ట్వీట్స్ చేశారు.ధామి సీఎంగా సమర్ధుడైన వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లగలరన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

 

మరిన్ని  ఇక్కడ చూడండి: Shocking Video: తేలు విషాన్ని చిమ్మడం ఎప్పుడైనా చూశారా?.. అయితే ఈ షాకింగ్ వీడియోలో చూడండి..

MS Dhoni Marriage Day: పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ కూల్..!