Suvendu Adhikari: బీజేపీ నేతల మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే బెంగాల్ లోపార్టీ ఓటమి.. సువెందు అధికారి

బీజేపీ నేతల మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే బెంగాల్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఈ పార్టీ నేత సువెందు అధికారి అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ 170 నుంచి 180 వరకు సీట్లు గెలుచుకుంటుందని వారు ధీమాగా ఉన్నారని..

Suvendu Adhikari: బీజేపీ నేతల మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే బెంగాల్ లోపార్టీ ఓటమి.. సువెందు అధికారి
Suvendu Adhikari

Edited By: Phani CH

Updated on: Jul 19, 2021 | 10:26 AM

బీజేపీ నేతల మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే బెంగాల్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఈ పార్టీ నేత సువెందు అధికారి అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ 170 నుంచి 180 వరకు సీట్లు గెలుచుకుంటుందని వారు ధీమాగా ఉన్నారని..ఈ కారణంగానే క్షేత్ర స్థాయి పరిస్థితిని అంచనా వేయలేకపోయారని ఆయన చెప్పారు.పూర్బా మెడ్నిపూర్ జిల్లాలోని చండీపూర్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మొదటి రెండు..మూడు రౌండ్లలో బీజేపీ ముందంజలో ఉంటూ వచ్చిందని..దాంతో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా మనకు 170 నుంచి 180 వరకు సీట్లు రావడం గ్యారంటీ అని మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రకటించారని అన్నారు. కానీ వీరు తగిన గ్రౌండ్ వర్క్ చేయని కారణంగా పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. సరైన గ్రౌండ్ వర్క్ తో బాటు హార్డ్ వర్క్ కూడా ముఖ్యమే.. అప్పుడే మన లక్ష్యాలను సాధించుకోగలుగుతాం అని సువెందు అధికారి పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి.

అయితే అధికారి కామెంట్స్ పై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. సీఎం మమతాబెనర్జీ చేపట్టిన అభివృద్ధి పనులవల్లే తమ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగిందని పేర్కొన్నారు. 200 సీట్లకు మించి గెలుచుకుంటామన్న భ్రమలో కొనసాగిన బీజేపీ వారు ఫూల్స్ ప్యారడైజ్ (మూర్ఖుల స్వర్గం)లో ఉంటూ వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. మీరు కూడా 170 కి మించి స్థానాలు గెలుచుకుంటామని చెప్పుకోలేదా అని సువెందు అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రజల నాడిని బీజేపీ గుర్తించలేకపోయిందని, కానీ తమ పార్టీ గుర్తించిందని ఆయన అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Paralympics 2020: అథ్లెట్‌గా మారిన కలెక్టర్.. సరికొత్త రికార్డుతో పారా ఒలింపిక్స్‌కు పయనం!

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా..? రుణం ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి..?