Triple Ride: బైక్ పై ఇక ముగ్గురు వెళ్ళడానికి అనుమతిస్తారట.. కారణం ఇదేనని చెబుతున్నారు!

|

Oct 22, 2021 | 11:47 AM

కొన్ని సందర్భాల్లో నేతలు ప్రజల నుంచి తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు విచిత్రంగా ఉంటాయి. నక్కకీ నాగలోకానికీ ముడిపెట్టి మాట్లాడేసి వినే వారిని కన్ఫ్యూజ్ చేసేస్తారు. అటువంటిదే ఇది కూడా.. అసలీ ట్రిపుల్ రైడ్ కథ ఏమిటంటే..

Triple Ride: బైక్ పై ఇక ముగ్గురు వెళ్ళడానికి అనుమతిస్తారట.. కారణం ఇదేనని చెబుతున్నారు!
Triple Ride
Follow us on

Triple Ride: పెట్రోల్ ధరల మంటలు సామాన్యులను దహించివేస్తున్నాయి. రోజు రోజుకూ పైకి కదలడమే తప్ప కిందికి దిగిరావడం పెట్రోల్ ధరలకు కనపడటం లేదు. ఇప్పటికే 111 రూపాయలకు చేరుకుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం మీద ప్రజలు కోపాన్ని ప్రదర్శించడం సహజం. ధరల పెరుగుదలకు అనేక కారణాలుండవచ్చు. కానీ, అవేవీ ప్రజలకు సంబంధం ఉండదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించలేక పోయింది అనే భావన అందరిలోనూ ఉంటుంది. దాంతో సహజంగానే ప్రజలు ప్రభుత్వాన్ని నేరుగానే విమర్శిస్తారు. ఈ విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా వారు నోటికొచ్చిన మాటలు చెప్పేస్తున్నారు.

కొంతమంది నాయకులు పెట్రోల్ ధర పెరగడానికి కారణం తాలిబన్లు అంటూ చెప్పుకొస్తున్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించుకోవడం వలన పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. కొంతమంది మరింత వింతగా చెబుతున్నారు. ఉచితంగా కోవిడ్ టీకాలు ఇవ్వడం వలన పెట్రోల్ ధరలు పెంచాల్సి వస్తుందని చెప్పి తప్పించుకున్నాం అని సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే కొందరు నాయకులు పెట్రోల్ ధరలపై వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలూ పారేస్తున్నారు. ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి పెట్రోల్ మంటల గురించి మాట్లాడుతూ.. సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిది అంటూ స్టేట్మెంట్ పారేశారు.

ఇదిలా ఉంటె అస్సాంకు చెందిన బిజెపి నాయకుడు కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన విధానం చెప్పారు. పెట్రోల్ ధర పెరుగుదల ఇప్పుడు ఆగే పరిస్థితి లేదని పరోక్షంగా చెప్పారు. పెట్రోల్ ధర రాష్ట్రంలో లీటరుకు రూ200కి పెరిగినప్పుడు వాహనాల పై ప్రయాణీకులను మూడింతలు అనుమతిస్తారని అసోం అధ్యక్షుడు భబేష్ కలిత చెప్పినట్లు సమాచారం. అక్కడి రాజకీయ వర్గాల్లో ఈ మాటలు చర్చనీయాంశంగా మారాయి. “ఇంధన ధర రూ. 200కి పెరిగిన తర్వాత ద్విచక్ర వాహనాలలో ప్రయాణీకులను మూడు రెట్లు పెంచడానికి అనుమతిస్తామని చెప్పారు. ఒక బైక్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని చెప్పారు. అంతేకాదు.. ఈ అనుమతి ఇచ్చిన తరువాత ద్వి చక్ర వాహనాలలో మూడు సీట్ల తయారీకి కూడా కంపెనీలు అనుమతి పొందవచ్చు,”అని ఆయన చెప్పారు.

కలితా చేసిన ఈ వ్యాఖ్యలు అంతటా సంచలనం కలిగిస్తున్నాయి. పెట్రోల్ ధర 200కి చేరుతుంది అని ఆయన చెబుతున్నారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. లేకపోతే బైక్ లపై ముగ్గురు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ విరుచుకుపడుతున్నాయి.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..

పెట్రోల్ ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశం చమురు అవసరాలను తీర్చడానికి 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాని ప్రభావం నేరుగా మనపై పడుతోంది. అదీకాకుండా డిమాండుకు తగినంత దిగుబడులు చేసుకునే అవకాశమూ ప్రస్తుతం లేదు. అంతర్జాతీయంగా ఉన్న సమస్యలతో క్రూడాయిల్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Knife: ఇదో సూపర్ కత్తి.. స్టీల్‌తో చేసింది కాదు..నాన్ వెజ్ కూడా స్మూత్ గా కట్ చేయొచ్చు..దీనిని దేనితో చేశారో తెలుసా?

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

Pakistan: మళ్ళీ గ్రే లిస్టులో పాకిస్తాన్‌.. టెర్రరిజానికి కొమ్ము కాస్తున్నందుకు రెట్టింపైన పాక్ కష్టాలు!