రైతుల ఆందోళనపై భారత సెలబ్రిటీలు చేసిన ట్వీట్ల మీద దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించగానే, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. మీ మరాఠీ గర్వం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారుణమని, తీవ్రంగా ఖండించదగినదని అన్నారు. మీ మహారాష్ట్ర ధర్మం ఎక్కడికి పోయిందన్నారు. భారత రత్న పురస్కారాలు పొందినవారి వ్యాఖ్యలపై ఇన్వెస్టిగేషన్ జరపాలని ఆదేశించారని, ఇలాంటి ‘రత్నాలను’ తాము ఎక్కడా చూడలేదని ఫడ్నవీస్ దెప్పి పొడిచారు.
ఈ సెలబ్రెటీలంతా దేశంకోసం ఒకే గళం కలిపారని ఆయన చెప్పారు. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో కేంద్రం తీరును సమర్థిస్తూ సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ తదితరులు ట్వీట్లు చేసిన సంగతి గమనార్హం.
అయితే ఈ ట్వీట్స్ అన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయని, వీటిపై ఇన్వెస్టిగేట్ చేయాలనీ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. బహుశా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీరిపై ఒత్తిడి తెచ్చిందా అన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ జరిపేందుకు హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అంగీకరించారు కూడా.
Read More:‘ఎఫ్ 3’ సెట్స్‌పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్.. రెడీగా ఉన్న వెంకీ, వరుణ్
Read More: ఈ నెల 20 నుంచి కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్, హర్యానా మంత్రి అనిల్ విజ్ ఫస్ట్ వలంటీర్ ,