కర్ణాటకలో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో 136 సీట్లతో కాంగ్రెస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో బీజేపీకి కర్ణాటకలో మాత్రమే అధికారం ఉండగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. అయితే బీజేపీ కేవలం 65 సీట్లు రాగా.. జేడీఎస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ఇండియా టుడే అనే న్యూస్ ఛానల్‌లో బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా లైవ్ డిబెట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఈయన ప్రముఖ జర్నలిస్ట్ అయిన రాజ్‌దీప్ సర్దేశాయిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది.
రాజ్‌దీప్ అడిగిన ఓ ప్రశ్నకి అమిత్ మాల్వియా తీవ్రంగా స్పందించారు. ఇదంతా ఓ ప్రచారమని.. మీకు 58 ఏళ్లు వచ్చాయని, రిటైర్ అవ్వండి అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 2024 బీజేపీ ఎలా గెలుస్తుందనే దానిపై మూడో పుస్తకం రాయండంటూ విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ కాళ్ల కింద పడి రాజ్యసభ సీటు కోసం అడగండి అంటూ మండిపడ్డారు. కానీ రాజ్‌దీప్ మాత్రం డిబెట్ జరుగుతున్నంత సేపు కూల్‌గా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలని..నన్ను దయచేసి బెదిరించవద్దని అమిత్ మాల్వియాతో అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sharing the video, for those who haven’t seen it pic.twitter.com/oPEQvEpQi1
— cassandra nazareth (@cassynaz) May 13, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.