బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సోమవారం వారణాసిని సందర్శించి కాశీ విశ్వనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి కాలభైరవ ఆలయంలో కూడా ప్రార్థనలు చేసి కచోరీ, స్వీట్స్ తిన్నారు. ఈ దేశ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం తాను పూజలు చేశానని, అర్చనలు చేయించానని ఆ తరువాత ట్వీట్స్ చేశారు. వారణాసిలో కొత్తగా నిర్మించిన ప్రయాగ్ రాజ్ మహావిద్యాలయను నడ్డా ప్రారంభించనున్నారు. అలాగే పలువురు సామాజిక నేతలను కలుసుకుని స్థానిక సమస్యలపై చర్చించబోతున్నారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఇంకా జరగనున్న కార్యక్రమాల్లో నడ్డా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆలయాలను సందర్శించిన తరువాత తను ఎంతో శక్తిమంతునిగా ఫీలవుతున్నానని ఆయన అన్నారు. పూజల తరువాత కొత్త శక్తిని సంతరించుకున్నానని, దీన్ని దేశం కోసం, సమాజం కోసం వినియోగిస్తానని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇలా ఉండగా నడ్డా మంగళవారం పండిట్ ఉపాధ్యాయ స్మృతి స్థలం వద్ద దీన్ దయాళ్ ఉపాధ్యాయకి నివాళులర్పిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వారణాసి లోని రోహియాలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నడ్డా ప్రారంభించనున్నారు.
నడ్డా రెండు రోజులపాటు వారణాసి పర్యటన చేయనున్నారు. 2022 లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017 లో జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిచి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 403 మంది సభ్యులున్న అసెంబ్లీలో 309 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సన్నద్డం చేసేందుకు నడ్డా నడుం బిగించినట్టు కనబడుతోంది. మోదీ సొంత నియోజకవర్గం గనుక సహజంగానే ఇక్కడ పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
Read More :
High Tension Video :తిరుపతి ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు వాగ్వాదం..ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం.