‘ మీ నిర్వాకం తెలియనిదెవరికి’? సోనియాపై జవదేకర్ ఫైర్

ఢిల్లీ హింసపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణల పర్వం ప్రారంభమైంది. ఈ అల్లర్లను కాంగ్రెస్, ఆప్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు.

 మీ నిర్వాకం తెలియనిదెవరికి? సోనియాపై జవదేకర్ ఫైర్

Edited By:

Updated on: Feb 27, 2020 | 6:49 PM

ఢిల్లీ హింసపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణల పర్వం ప్రారంభమైంది. ఈ అల్లర్లను కాంగ్రెస్, ఆప్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. ఈ హింసాకాండలో ఒక పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన మరో అధికారి మృతి చెందినా ఈ పార్టీలు నోరెత్తడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీయే.. హింసను ప్రేరేపించారని,   ‘అంతమయ్యేవరకూ పోరాడండి ‘ అని  ఆమె గత డిసెంబరులోనే పిలుపునిచ్చారని ఆయన విమర్శించారు. మేము శాంతి నెలకొనాలని అంటుంటే మీరు మాత్రం.. అల్లర్లు, ఘర్షణలను రెచ్ఛగొడుతున్నారు అని జవదేకర్ అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. అల్లర్ల బాధితులను మత ప్రాతిపదికన అసెంబ్లీలో గుర్తించడమేమిటని ఆయన ప్రశ్నించారు. అసలు ఒకప్పుడు సిక్కుల రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ ‘కళ్ళ జూడలేదా’ అని ప్రకాష్ జవదేకర్..నాడు పంజాబ్ లో జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తు చేశారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us