BJP picks first-time MLA Bhajan Lal Sharma: బీజేపీ హైకమాండ్ సంచలనాల పరంపరను కొనసాగిస్తోంది. రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును ఖరారు చేసింది. జైపూర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మకు సీఎం పదవి దక్కింది. సంగనేర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు భజన్‌లాల్ శర్మ. సీఎం పదవి కోసం వసుంధరా రాజే, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బాబా బాలక్‌నాథ్ , దియాకుమారి పోటీ పడ్డారు. అయితే చివరిక్షణంలో భజన్ లాల్ పేరును బీజేపీ తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ గెలిచిన మూడు చోట్ల కూడా కొత్త వారిని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్ లో బీజేపీ ఘన విజయం అనంతరం .. సీఎం పదవి తనకే ఇవ్వాలని వసుంధరా రాజే పట్టుబట్టారు. హైకమాండ్ నచ్చచెప్పడంతో ఆమె సీఎం రేసు నుంచి తప్పుకున్నారు. 60 మంది ఎమ్మెల్యేలతో ఆమె ఇప్పటికే బలప్రదర్శన చేశారు వసుంధరా. హైకమాండ్ దూత రాజ్‌నాథ్‌సింగ్ ఆమెతో సమావేశమయ్యారు. అయితే సీఎం రేసులో అనితా బదేల్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. చివరకు అనూహ్యంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మాదిరిగా.. రాజస్థాన్ సీఎంగా కొత్తవారిని పార్టీ అధిష్టానం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
చత్తీస్‌ఘడ్ , మధ్యప్రదేశ్ సీఎంలుగా ఎవరు ఊహించని నేతలను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. రాజస్థాన్‌లో కూడా పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. బీజేపీ హైకమాండ్ దూతలుగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో పాటు సరోజ్ పాండే , వినోద్ తావ్డే కూడా ఎమ్మెల్యేల భేటీకి హాజరయ్యారు.
200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ 115 సీట్లలో ఘనవిజయం సాధించింది. చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీ నేతలకు, మధ్యప్రదేశ్‌లో ఓబీసీకి ఛాన్స్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..