
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో పాకిస్తాన్ బెలూన్లు కలకలం రేపాయి. బిస్కెట్ ప్యాకెట్లలో పాకిస్తాన్ జెండాలు, వాటిపై 14 ఆగష్టు స్వాతంత్ర్య వేడుక అని రాసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. గంగ్‌ధర్ సబ్‌డివిజన్‌లో పిల్లలకు అమ్మే బిస్కెట్ ప్యాకెట్లలో పాకిస్తాన్ జెండాలు, ఆకుపచ్చ రంగులో ఉండే ఆగస్టు 14 స్వాతంత్ర్య వేడుక అనే బెలూన్లు కనిపించడం ఈ ప్రాంతంలో తీవ్ర చర్చలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రహ్లాద్ రాథోడ్ అనే వ్యక్తి కిరాణాషాపులో తన పిల్లలకు బిస్కెట్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. కాసేపటికే పిల్లలు ప్యాకెట్‌లో ఉన్న బెలూన్‌ను గాలితో నింపగానే, అందులో పాకిస్తాన్ జెండా, ఆగస్టు 14 స్వాతంత్ర్య వేడుక అని వ్రాసిన బెలూన్ కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పొరుగువారికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి ఘటనలు దేశానికి విఘాతం కలిగించగలవని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా
పిల్లల అమాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఒక దేశ వ్యతిరేక కుట్ర అని ఆరోపించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిరాణా దుకాణం నుంచి అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్‌లో భద్రంగా ఉంచారు. ఈ వస్తువులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలోట్ నుంచి డెలివరీ చేశారని దుకాణదారుడు పోలీసులకు వెల్లడించాడు. వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సరఫరా నెట్‌వర్క్‌ను పరిశీలిస్తున్నారు. ఈ బిస్కెట్ ప్యాకెట్లను సరఫరా చేసిన మధ్యప్రదేశ్‌లోని అలోట్‌కు ఒక బృందం చేరుకుంది. బిస్కెట్ ప్యాకెట్లపై పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని తయారీ కంపెనీ చిరునామా కూడా ఉంది. నిందితుడైన సరఫరాదారుని అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటనలోని పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.
ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు