Aviptadil: కరోనా చికిత్సకు మరో హైదరాబాద్ ఔషధం.. ‘అవిప్టాడిల్’ అత్యవసర అనుమతికి బయోఫోర్ దరఖాస్తు

|

Jun 12, 2021 | 12:12 PM

Biophore applies to DCGI: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు ఇప్పటికే పలు కంపెనీలు ఔషధాలను

Aviptadil: కరోనా చికిత్సకు మరో హైదరాబాద్ ఔషధం.. ‘అవిప్టాడిల్’ అత్యవసర అనుమతికి బయోఫోర్ దరఖాస్తు
Aviptadil Drug
Follow us on

Biophore applies to DCGI: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు ఇప్పటికే పలు కంపెనీలు ఔషధాలను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో మరో హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ మరో ముందడుగు వేసింది. తాము తయారుచేసిన ‘అవిస్టాడిల్‌’ ఔషధానికి అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ శుక్రవారం కోరింది.

డీజీసీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు బయోఫోర్ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ ఔషధ వినియోగంతో కోవిడ్‌ సీరియస్‌ కేసుల్లో రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు రుజువైనట్లు తెలిపారు. వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పెప్డైడ్ ౌలీత అవిస్టాడిల్ ఆసుపత్రుల్లో సీరియస్ కండిషన్‌లో చికిత్స పొందుతున్న రోగులు కోలుకోవడానికి ఉపయోగపడుతుందని క్లినికల్ టెస్టుల్లో నిరూపితం అయిందని కంపెనీ సీఈవో డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు.

కోవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో యాంటీ వైరల్‌ ఔషధం ‘ఫావిఫిరవిర్‌’ ఉత్పత్తికి అనుమతి పొందిన అతికొద్ది కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ ఒకటిగా నిలిచింది. దీని తర్వాత ఇప్పుడు అవిప్టాడిల్ ను రూపొందించి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అయితే దీనికి డీసీజీఐ నుంచి అనుమతులు రాగానే ఉత్పత్తిని ప్రారంభిస్తామని బయోఫోర్ ప్రతినిధులు తెలిపారు.

Also Read:

Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..

మీ ఫోన్ వర్షంలో తడిసిపోయిందా ? అయితే ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి.. చాలా డేంజర్..