Prasanna Sankar: నా భార్య రూ.9కోట్లు డిమాండ్ చేస్తోంది.. రచ్చకెక్కిన టెక్ బిలియనీర్ ఇంటి వ్యవహారం..

|

Mar 25, 2025 | 1:40 PM

ప్రముఖ హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు, అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రసన్న శంకర్ నారాయణ ప్రస్తుతం తన భార్య దివ్య శశిధర్ తో విడాకుల వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడి ప్రస్తుతం తాను పరారీలో ఉన్నానని ప్రసన్న శంకర్ నారాయణ స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు..

Prasanna Sankar: నా భార్య రూ.9కోట్లు డిమాండ్ చేస్తోంది.. రచ్చకెక్కిన టెక్ బిలియనీర్ ఇంటి వ్యవహారం..
Prasanna Sankar
Follow us on

చెన్నై టెక్ బిలియనీర్ ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. లక్ష కోట్ల కంపెనీలకు అధిపతి అయిన ప్రసన్న శంకర్ భార్య బాధితుడు అయ్యాడు. ఆయన వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ ‘రిప్లింగ్’ సహ వ్యవస్థాపకుడు, అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రసన్న శంకర్ నారాయణ ప్రస్తుతం తన భార్య దివ్య శశిధర్ తో విడాకుల వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడి ప్రస్తుతం తాను పరారీలో ఉన్నానని ప్రసన్న శంకర్ నారాయణ స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.. దీంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ విషయంపై స్పందించారు.. తాము అరెస్టు చేయమని చెప్పడంతో ఈ వివాదానికి కాస్త బ్రేక్ పడినట్లయింది.. ఈ క్రమంలో ప్రసన్న శంకర్ పోలీసులపై కూడా పలు ఆరోపణలుచేశారు.

ప్రముఖ హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ ‘రిప్లింగ్’ సహ వ్యవస్థాపకుడు, అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడిదారుడిగా ప్రసన్న శంకర్ నారాయణ వ్యవహరిస్తున్నారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు.. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

విడాకులకు దారి తీసిన పరిస్థితులను తన ఎక్స్ వేదికగా వెల్లడించాడు ప్రసన్న శంకర్ నారాయణ… తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని.. దీనిపై గొడవలు జరిగాయని తెలిపాడు.. తన భార్య తనపై అత్యాచారం, గృహ హింస, అపహరణ ఆరోపణలు చేసిందని.. పోలీసులలోని తన సంబంధాలను ఉపయోగించుకుని నిరాధారమైన ఆరోపణలతో తనను హింసించిందని ప్రసన్న శంకర్ ఆరోపించారు.

అయితే భర్త ప్రసన్న శంకర్ నారాయణపై భార్య దివ్య సంచలన ఆరోపణలు చేశారు. ప్రసన్న శంకర్ నారాయణ ఒక కామపిశాచి అని, రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని ఆరోపించారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతుల విడాకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..