పరీక్ష రాసేందుకు వెళ్లింది.. ప్రియుడిని పెళ్లాడి వచ్చింది.. ఇరు కుటుంబాలు షాక్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

|

Feb 21, 2021 | 5:13 PM

పదో తరగతి బోర్డు పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన యువతి తన ప్రియుడిని పెళ్లాడి తిరిగి వచ్చింది. ఇది చూసిన ఇరు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు....

పరీక్ష రాసేందుకు వెళ్లింది.. ప్రియుడిని పెళ్లాడి వచ్చింది.. ఇరు కుటుంబాలు షాక్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Follow us on

పదో తరగతి బోర్డు పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన యువతి తన ప్రియుడిని పెళ్లాడి తిరిగి వచ్చింది. ఇది చూసిన ఇరు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బీహర్‌లోని కతిహార్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మణిహరి ప్రాంతానికి చెందిన గౌరికి 2016లో మొబైల్‌ ఫోన్‌ మిస్డ్ కాల్‌ వచ్చింది. తిరిగి మిస్‌కాల్‌ చూసి కాల్‌బ్యాక్‌ చేయగా, నితీష్‌ అనే వ్యక్తి ఫోన్‌ నుంచి వచ్చినట్లు తెలిసింది. అలా ఫోన్‌ సంభాషణ ద్వారా వీరి ప్రేమ చిగురించింది. అలా మిస్‌ కాల్‌ ద్వారా నితీష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో వారే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పోలీసులను సంప్రదించారు. ఇద్దరు మేజర్లు కావడంతో వీరి ప్రేమ వివాహానికి పోలీసులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

ఈ నేపథ్యంలో శనివారం గౌరి పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. ఇక పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్లకుండా అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న ప్రియుడు నితీష్‌తో కలిసి ఓ గుడికి వెళ్లింది. గుడిలో వీరిద్దరు పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పైగా ఈ జంట పోలీసుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందారు.

అయితే పరీక్ష రాయలేనందున గౌరికి ఏ మాత్రం బాధలేదు. తాను ప్రేమలో పాస్‌ అయ్యానని, వచ్చే ఏడాది పరీక్ష రాస్తాను అంటూ ఆ యువతి చెప్పుకొచ్చింది. మరో వైపు వీరి వివాహ విషయాన్ని పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు తెలిపారు. మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నారని నచ్చజెప్పారు. వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో ఆ యువతి ప్రియుడిని తీసుకుని ఇంటికెళ్లింది.

Also Read: Bird Flu: మనుషులకు సోకుతున్న బర్డ్‌ ఫ్లూ.. ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా..? రష్యా పరిశోధకులు ఏమంటున్నారు..?