కన్నతండ్రి కాదు కసాయి.. కూతుర్ని చంపి.. ఆపై 3 రోజులు ఆమె మృతదేహంతో..!

బీహార్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురును హతమార్చిన తండ్రి, ఆమె మృతదేహాన్ని మూడు రోజులు పాటు బాత్రూమ్‌లోనే దాచిపెట్టాడు. తల్లి అనుమానంతో బండారం బయటపడింది. సమస్తిపూర్‌‌కు చెందిన ముఖేష్ సింగ్ తన సొంత కూతురిని గొంతు కోసి చంపాడు. ఆమె మృతదేహాన్ని తన ఇంటి బాత్రూంలోనే మూడు రోజులు దాచిపెట్టాడు.

కన్నతండ్రి కాదు కసాయి.. కూతుర్ని చంపి.. ఆపై 3 రోజులు ఆమె మృతదేహంతో..!
Bihar Crime

Updated on: Apr 11, 2025 | 1:24 PM

బీహార్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురును హతమార్చిన తండ్రి, ఆమె మృతదేహాన్ని మూడు రోజులు పాటు బాత్రూమ్‌లోనే దాచిపెట్టాడు. తల్లి అనుమానంతో బండారం బయటపడింది. సమస్తిపూర్‌‌కు చెందిన ముఖేష్ సింగ్ తన సొంత కూతురిని గొంతు కోసి చంపాడు. ఆమె మృతదేహాన్ని తన ఇంటి బాత్రూంలోనే మూడు రోజులు దాచిపెట్టాడు. మరణించిన కుమార్తె తల్లి పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై కేసు నమోదు చేయడంతో ఈ హత్య ఉదంతం బయటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మొహియుద్దీన్ నగర్‌లోని టాడా గ్రామానికి చెందిన ముఖేష్ సింగ్ కూతురు సాక్షి అనే 25 ఏళ్ల అమ్మాయి కొన్ని రోజుల క్రితం తన ప్రేమికుడితో ఇంటి నుండి పారిపోయింది. సాక్షి బీహార్ నుండి పారిపోయి ఢిల్లీకి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆమె అచూకీ తెలుసుకుని వెళ్లిన తండ్రి ముఖేష్ సింగ్, ఆమెకు మాయమాటలు చెప్పి, ఇంటికి తిరిగి రమ్మని కోరాడు. తండ్రి మాటలు నిజమని నమ్మి, సాక్షి ఢిల్లీ నుండి బీహార్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చింది. కానీ ఆమె ఇంటికి చేరుకున్న వెంటనే, తండ్రి గొంతు కోసి చంపాడు. తన కుమార్తె మృతదేహాన్ని మూడు రోజుల పాటు బాత్రూమ్‌లో దాచిపెట్టాడు.

ఇంటికి తిరిగి వచ్చిన సాక్షి కనిపించకపోవడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చింది. కూతురు మళ్లీ కనిపించపోవడంతో భర్తను నిలదీసింది. అయితే తన కూతురు మళ్ళీ పారిపోయిందని ముఖేష్ సింగ్ నమ్మబలికాడు. దీంతో సాక్షి తల్లికి అనుమానం మరింత పెరిగింది. ఆమె తన సోదరి, మరిదితో మాట్లాడి, తన భర్త హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పింది. దీంతో ముగ్గురూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన తండ్రిని విచారించడంతో సాక్షి మళ్ళీ పారిపోయిందని పోలీసులను సైతం తప్పుదారి పట్టించాడు.

అయితే అనుమానంతో పోలీసులు ఇంట్లో సోదా చేయడంతో సాక్షి మృతదేహం బాత్రూమ్‌లో బయటపడింది. దీంతో సాక్షి తండ్రిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..