Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు

|

Sep 18, 2021 | 11:17 AM

Bank Balance: సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయుల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. ఆకస్మాత్తుగా కోట్లాది రూపాయలు జమ కావడం ఆశ్చర్యానికి..

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు
Follow us on

Bank Balance: సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయుల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. ఆకస్మాత్తుగా కోట్లాది రూపాయలు జమ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాగే ఒక వ్యక్తి బ్యాంకు అకౌంట్లో కోట్లాది రూపాయలు జమ కావడం అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.  ఈ ఘటనలు బీహార్ లో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇద్దరు విద్యార్థులు బ్యాంకు అకౌంట్స్‌లో రూ. 960 కోట్లు జమ అయిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల ఖాతాల్లో అంత మొత్తం ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి విచారణ సాగుతుండగానే.. అదే రాష్ట్రంలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ రైతు బ్యాంక్ ఖాతాలో రూ. 52 కోట్లు జమ అయ్యాయి. పింఛన్‌కు సంబంధించి కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లగా.. అతని ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడినట్టుగా గుర్తించాడు.  బీహార్‌లోని ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా కొంత కాలం కిందట వృద్దాప్య పింఛను కోసం బ్యాంక్ ఖాతాను తెరిచాడు. అయితే రామ్ బహుదుర్.. తన పింఛన్ డబ్బులకు సంబంధించి అకౌంట్‌ను చెక్ చేసుకోవడానికి సమీపంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లాడు. అక్కడ ఆధార్ కార్డు సమర్పించిన అతడు, వేలిముద్ర వెరిఫికేషన్‌ చేశాడు. అతని అకౌంట్‌లో రూ. 52 కోట్లు గుర్తించిన కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆపరేటర్ షాక్‌కు గురయ్యాడు. ఇదే విషయాన్ని రామ్ బహుదుర్‌కు తెలియజేశాడు.

క్షణాల్లోనే ఈ విషయం ఆ చుట్టుపక్కల వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు రాహ్ బహుదుర్ వద్దకు చేరుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి రామ్ బహుదుర్ మాట్లాడుతూ.. ఈ విషయం తెలిసి మేము షాక్ తిన్నాం. ఇంత పెద్ద మొత్తం నా బ్యాంకు ఖాతాలో ఎలా వచ్చిందని ఆశ్చర్యమేసింది. మేము వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని నా ఖాతాలో పడిన కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం ఆనందంగా గడిచిపోతుంది అని చెప్పుకొచ్చాడు. అయితే బ్యాంకు ఖాతాల్లో కోట్లాదిగా డబ్బులు వస్తుండటంతో వాటిని విత్‌డ్రా చేసుకోకుండా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి స్థానికులు, మీడియా ద్వారా సమాచారం అందిందని కతిహర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ మనోజ్ పాండే తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాన్ని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. తాము కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు

అలాగే బీహార్‌లోని కతిరాహ్ జిల్లా జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థుల అకౌంట్లలోకి రూ. 960 కోట్లు డిపాజిట్ అయ్యాయి. విశ్వాస్ ఖాతాలో రూ.60 కోట్లు, అసిత్ కుమార్ అకౌంట్‌లో రూ.900 కోట్లు జమ అయింది. ఈ ఘటనతో బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా కూడా ఆశ్చర్యపోయారు. అమౌంట్ విత్ డ్రా చేసుకోకుండా వారిని నిలువరించారు. అనంతరం సంబంధిత సమాచారాన్ని పై అధికారులకు నివేదించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా డిపాజిట్ అయిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక, బిహార్‌లో సాధారణ ప్రజల ఖాతాల్లోకి కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరో వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షలు:

కాగా, ఇటీవలఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో రూ.5.5 లక్షలు వచ్చి చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. ఇప్పుడు నా అకౌంట్లో మోదీ మొదటి విడత కింద రూ.5.5 లక్షలు వేశాడని సదరు వ్యక్తి చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోంది. మోడీ డబ్బులు వేయడం ఏంటని అనుకుంటున్నారా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అసలు ట్వీట్‌ అదిరిపోయేలా ఉంది.

బీహార్‌లోని ఖగారియా జిల్లా మన్సి పోలీసు స్టేషన్‌ పరిధిలో భక్తియార్‌ గ్రామానికి చెందిన దాస్‌ అనే వ్యక్తి బ్యాంక్ ఖాతాలోకి రూ.5.5 లక్షలు జమ అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే ఖాతాలో పడిన డబ్బులు ప్రధాని మోదీ వేశాడని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల వరకు జమ చేస్తానని చెప్పాడని సదరు వ్యక్తి బ్యాంకు అధికారులకు, పోలీసులకు చెప్పడం గమనార్హం. అయితే ఆ డబ్బులు వేసింది మోదీ కాదు.. బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల అతని బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. తర్వాత గమనించిన బ్యాంకు సిబ్బంది ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అతనికి నోటీసులు పంపించారు. అయితే ఆ డబ్బులు మోదీ ప్రభుత్వం వేసిందని, మొత్తం డబ్బులు అవసరాలకు ఖర్చు అయ్యాయని, తిరిగి ఇవ్వలేనని చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇలా బీహార్‌ రాష్ట్రంలో సామాన్యుల ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అవుతుండటంతో సంచలనంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు విచారణ చేపడుతున్నారు. సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా చేరుతున్నాయి..? ఎక్కడ పొరపాటు జరుగుతోంది అనేదానిపై దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Pan Card And Aadhaar Link: అదిరిపోయే శుభవార్త.. పాన్‌- ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!

Apple Watch: భారత్‌ అంటే మీకు లెక్కలేదా..? యాపిల్‌ సంస్థపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన నటుడు

Share Market: ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే కాసుల పంట.. రూ. లక్ష పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..!