పట్టపగలు పాట్నాలో భీకర ఎన్‌కౌంటర్‌.. నలుగురు గ్యాంగ్‌స్టర్ల కోసం పోలీసుల వేట!

బీహార్ రాజధాని పాట్నాలో పోలీసులు, నేరస్థుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పాట్నా STF నేరస్థుల ఉన్న భవనాన్ని చుట్టుముట్టింది. పాట్నాలోని కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రామ్ లఖన్ పాత్‌లో రెండు వైపుల నుండి కాల్పులు జరుగుతున్నాయి. నలుగురు నేరస్థులు ఒక ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.. పోలీసులను గమనించిన దుండగులు కాల్పులు ప్రారంభించారు.

పట్టపగలు పాట్నాలో భీకర ఎన్‌కౌంటర్‌.. నలుగురు గ్యాంగ్‌స్టర్ల కోసం పోలీసుల వేట!
Patna Encounter

Updated on: Feb 18, 2025 | 10:14 PM

బీహార్‌ రాజధాని పాట్నాలో పట్టపగలు భీకర ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. నలుగురు గ్యాంగ్‌స్టర్ల కోసం పోలీసులు కమెండో ఆపరేషన్‌ చేపట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఇంట్లో నక్కిన దుండగులు పోలీసులను చూసి కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతూ పారిపోయారు. తరువాత రామ్‌లఖన్‌ మార్గ్‌లో ఓ షాపింగ్‌ కాంప్లెక్ల్‌ లోకి చొరబడ్డారు. నాలుగు అంతస్తుల భవనం లోకి చొరబడ్డ దుండగులను లొంగిపోవాలని సూచించినప్పటికి పట్టించుకోలేదు.

ఎన్‌కౌంటర్‌ కారణంగా ఆ ప్రాంతంలో దుకాణాలను మూసివేయించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే జనం ఏం జరుగుతుందో అర్ధం కాకపోవడంతో బిల్డింగ్‌ల పైకి ఎక్కి చూస్తున్నారు. దుండగల కోసం STF బలగాలు కూడా ఆపరేషన్‌ చేపట్టాయి. బీహార్‌ ATS బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. దుండగుల దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పాట్నాలోని కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఈ ఇంట్లో రెండు వై1పుల నుండి కాల్పులు జరుగుతున్నాయి. రామ్ లఖన్ పథ్‌లోని ఈ ఇంటి లోపల నలుగురు నేరస్థులు దాక్కుని లోపలి నుండి కాల్పులు జరుపుతున్నారు. పోలీసులు మొత్తం ఇంటిని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నేరస్థులను లొంగిపోవాలని కోరారు. కానీ దుండగులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నేరస్థులు ప్రవేశించిన ఇల్లు ఉపేంద్ర సింగ్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. సాయుధులైన నలుగురు దుండగులు దోపిడీ ఉద్దేశ్యంతో ఈ ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ప్రజలు సకాలంలో అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంత ఈ దుండగులు ఇంటి లోపల చుట్టుముట్టబడ్డారు. కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ కాకుండా, మరో మూడు పోలీస్ స్టేషన్ల నుండి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను పిలిపించారు. లోపలి నుండి కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నేరస్థులు నలుగురు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

చివరికి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే, భూవివాదంలో కాల్పులు జరిపిన నలుగురు గ్యాంగ్‌స్టర్లను పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఆఖరికి కమెండో ఆపరేషన్‌ చేపట్టారు. ఓ ఇంట్లో నక్కిన దుండగులు పోలీసులను చూసి కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతూ పారిపోయారు. తరువాత రామ్‌లఖన్‌ మార్గ్‌లో ఓ షాపింగ్‌ కాంప్లెక్ల్‌ లోకి చొరబడ్డారు. నాలుగు అంతస్తుల భవనం లోకి చొరబడ్డ దుండగులను లొంగిపోవాలని సూచించారు. కమెండోలతో పాటు ATS బలగాలు షాపింగ్‌ కాంప్లెక్స్‌ లోకి దూసుకెళ్లాయి. నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వాళ్లతో పాటు ఉన్న మరికొంతమంది అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..