Asaduddin Owaisi: 6 సీట్లు అడిగితే పట్టించుకోలేదు.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో ఎంఐఎం పోటీ..

బిహార్‌లో మజ్లిస్ 32 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. 100 సీట్లలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నామని మజ్లిస్‌ నేతలు చెబుతున్నారు. తమకు ఆరు సీట్లు ఇవ్వాలని అడిగితే ఇండి కూటమి నేతలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఒవైసీ.

Asaduddin Owaisi: 6 సీట్లు అడిగితే పట్టించుకోలేదు.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో ఎంఐఎం పోటీ..
Asaduddin Owaisi

Updated on: Oct 13, 2025 | 10:42 AM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయాలని మజ్లిస్‌ నిర్ణయించింది. 16 జిల్లాల్లో 32 మంది అభ్యర్ధులతో మజ్లిస్‌ తొలి జాబితాను విడుదల చేశారు. బిహార్‌లో థర్డ్‌ఫ్రంట్‌కు మజ్లిస్‌ నేతృత్వం వహిస్తుందని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.. తాము బీజేపీకి బీటీమ్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. ఇండియా కూటమి పార్టీలపై మండిపడ్డారు.

ఆరు సీట్లు ఇవ్వాలని లేఖ రాస్తే.. తేజస్వియాదవ్‌ పట్టించుకోలేదన్న ఒవైసీ

తమకు ఆరు సీట్లు ఇవ్వాలని లేఖ రాస్తే ఆర్జేడీనేత తేజస్వియాదవ్‌ పట్టించుకోలేదని ఒవైసీ విమర్శించారు. బీహార్‌ ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి మేరకు , బీజేపీని అడ్డుకోవడానికి తాము

‘‘మాకు ఆరు సీట్లు ఇవ్వాలని కోరాం. గత ఎన్నికల్లో మేము ఐదు సీట్లు గెలిచాం. వాళ్లు ఒప్పుకోకపోవడంతో పోటీకి సిద్దమయ్యాం. విమర్శలు పట్టించుకునే ప్రసక్తే లేదు. బిహార్‌ ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి మేరకు , వాళ్లిచ్చిన లెటర్‌ పై సంతకం చేశాం.. బీజేపీని ఎవరు అడ్డుకుంటాకో తేలిపోతుందని చెప్పాం.. బిహార్‌లో మా రాజకీయ ప్రస్థానం సీమాంచల్‌ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యింది. సీమాంచల్‌కు న్యాయం జరగాలి. ఐదేళ్ల క్రితం మేము దీనిపై సమావేశం కూడా నిర్వహించాం.’’ అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు..

సీమాంచల్‌ ప్రాంతంపై ఒవైసీ గురి

బిహార్‌లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల్‌ ప్రాంతంపై ఒవైసీ గురి పెట్టారు. గతంలో ఐదు సీట్లు ఇక్కడి నుంచే గెలిచారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తాము మద్దతిస్తునట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదననారు ఒవైసీ. అభివృద్దిచ కోసం తాము అడిగిన నిధులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారని అన్నారు.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీ ఇండి కూటమిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అయితే ముస్లిం ఓటు బ్యాంక్‌ తమవైపే ఉందని చెబుతున్నారు తేజస్వి యాదవ్‌..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..