కులగణన ఒక్కసారైనా జరగాలని నితీష్ కుమార్ పట్టు.. ప్రధాని మోడీని కలిసిన 10పార్టీల బృందం

|

Aug 23, 2021 | 1:15 PM

కులాల వారీగా జనగణన చేపట్టాలనే డిమాండ్‌తో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మొత్తం 10పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఒక్కసారైనా కులగణన జరగాలని తద్వారా దేశంలోని...

కులగణన ఒక్కసారైనా జరగాలని నితీష్ కుమార్ పట్టు.. ప్రధాని మోడీని కలిసిన 10పార్టీల బృందం
Bihar Cm Nitish Kumar
Follow us on

కులాల వారీగా జనగణన చేపట్టాలనే డిమాండ్‌తో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మొత్తం 10పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఒక్కసారైనా కులగణన జరగాలని తద్వారా దేశంలోని ప్రజలందరూ ప్రయోజనం పొందుతారని అంటున్నారు నితీశ్‌. ప్రధాని మోడీతో నితీష్‌ బృందం భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం ప్రధాని తమ డిమాండ్లను విన్నారని.. కులాలవారీ జనగణన పట్ల సానుకూలంగా స్పందించారని వెల్లడించారు నితీశ్‌ కుమార్‌. కులాల వారీ జనగణనతో అందరికీ ప్రయోజనం కలుగుతుందంటున్నారు అఖిలేష్‌ యాదవ్‌. సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ దక్కుతాయంటున్నారు.

దేశంలో కులాలవారీగా జనాభాను లెక్కించాలంటూ డిమాండ్స్‌ వస్తుండటంతో కేంద్ర మాత్రం ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై ఓ ఏడాది తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉంది. ప్రస్తుతానికి 2021 జనాభా లెక్కలు పూర్తి చేయడంపైనే దృష్టి సారించింది.

ప్రతి పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈలోపు బీజేపీలోని పాటు మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి కులాల వారీగా జనాభా లెక్కలు జరగాలంటూ డిమాండ్స్‌ వస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే సమయంలోనూ దాదాపుగా అన్ని పార్టీలు ఇదే డిమాండ్‌ వినిపించాయి.

కేంద్రం గత నెలలో.. పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కించాలని చేసిన ప్రకటన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్‌ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బిహార్‌ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కానీ కేంద్రం ఇందుకు విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందంతో ప్రధానిని నితీశ్​ కలిశారు.

ఇవి కూడా చదవండి: Jewellers businessmen: వద్దేవద్దు.. గోల్డ్‌పై హాల్‌మార్కింగ్‌కు వ్యతిరేక గళం.. ఇవాళ వ్యాపారుల నిరసన

Viral Video: ఈ మినీ బస్సు చాలా స్పెషల్.. రోడ్డుపై పరుగులు పెడుతుంది.. కానీ అన్ని బస్సుల్లా కాదు..