PM Modi: భారత్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను తయారు చేస్తోంది.. ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన

|

Oct 30, 2022 | 4:59 PM

ఇప్పుడు భారతదేశం కూడా రవాణా విమానాల తయారీలో పెద్ద దేశంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు.వడోదరలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ గ్లోబ్ అనే ఈ మంత్రంతో భారతదేశం ముందుకు సాగుతోందని అన్నారు.

PM Modi: భారత్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను తయారు చేస్తోంది.. ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
PM Modi
Follow us on

గుజరాత్‌లో ప్రధాని మూడు రోజుల పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. గుజరాత్‌లోని వడోదరలో సి-295 రవాణా విమానాల తయారీ ప్లాంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (అక్టోబర్ 30) శంకుస్థాపన చేశారు. అంతకుముందు వడోదర చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. రోడ్డు పక్కన నిలబడిన ప్రజలు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్, టాటా సన్స్ చైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్, అర్బన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌లు ప్రధాని మోదీని సత్కరిస్తూ జ్ఞాపికలను అందజేశారు. వడోదరలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ గ్లోబ్ అనే ఈ మంత్రంతో భారతదేశం ముందుకు సాగుతోందని అన్నారు. భారత సైన్యం కోసమే ఈ రవాణా విమానాలను టాటా ఎయిర్‌బస్‌ సంస్థ తయారు చేస్తోంది. భారత్‌లో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని అన్నారు ప్రధాని మోదీ. విమానాల తయారీలో ఆత్మ నిర్భర్‌ కావాలన్న భారత్‌ కలలు నెరవేరుతున్నాయని అన్నారు ప్రధాని మోదీ. రక్షణరంగం, ఎయిర్‌స్పేస్‌ రంగాలను ఆత్మనిర్భర్‌ చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.22 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ. ఉత్తరప్రదేశ్‌ , తమిళనాడులో డిఫెన్స్‌ కారిడార్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇప్పుడు భారత్ కూడా రవాణా విమానాల తయారీలో పెద్ద దేశంగా మారనుందన్నారు. ఈ రోజు ఇది భారతదేశంలో ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల విమానం భారతదేశంలో కూడా తయారు చేయబడే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాన్నారు ప్రధాని మోదీ.

భారత్‌లో డిఫెన్స్‌ , ఎయిర్‌స్పేస్‌ రంగంలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారని అన్నారు మోదీ. భారత్‌లో విమానయాన రంగం చాలా వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు.

భారత్‌ ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు ప్రధాని . త్వరలో పెద్ద పెద్ద ప్యాసింజర్‌ విమానాలను తయారు చేసే స్థాయికి భారత్‌ ఎదుగుతుందన్నారు. ఆ విమానాలపై మేక్‌ ఇన్‌ ఇండియా అని రాసి ఉంటుందన్నారు.

మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ వైపు అడుగులు..

భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఉత్ప‌త్తి హ‌బ్‌గా మార్చే దిశ‌గా ఈరోజు మ‌నం పెద్ద అడుగు వేస్తున్నామ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. భారతదేశం నేడు తన స్వంత యుద్ధ విమానం, ట్యాంక్, జలాంతర్గామిని తయారు చేస్తోంది. ఇది మాత్రమే కాదు.. భారతదేశంలో తయారైన మందులు, వ్యాక్సిన్లు కూడా ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వానికి మాత్రమే అన్నీ తెలుసు అనే మనస్తత్వం ఇప్పటి వరకు ఉండేది. ప్రైవేటు రంగాన్ని పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అటువంటి పరిస్థితిలో  లాజిస్టిక్స్ మొదలైన వాటి తయారీపై దృష్టి పెట్టలేదన్నారు ప్రధాని మోదీ.

వడోదర ఇప్పుడు విమానయాన రంగ హబ్‌గా మారుతుంది..

రానున్న కాలంలో భారత్‌కు 2000 విమానాలు (ప్రయాణికులు) అవసరమవుతాయని చెప్పారు. ఇప్పుడు భారత్ కూడా రవాణా విమానాలను తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియా అని రాసి ఉండే ప్యాసింజర్ విమానాలను కూడా తయారు చేస్తారు. ఇక్కడ నిర్మించబడుతున్న రవాణా విమానం మన సైన్యానికి బలాన్ని అందించడమే కాకుండా, మన విమానాల తయారీకి కొత్త పర్యావరణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తుంది. విద్య, సంస్కృతిగా పేరొందిన వడోదర ఇప్పుడు విమానయాన రంగ హబ్‌గా కొత్త గుర్తింపును పొందనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం