మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రేకి షాక్.. షిండే వర్గంలో చేరిన మరో ఎంపీ..

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఆ పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు షాకిస్తున్నారు. తాజాగా మరో ఎంపీ పార్టీని విడారు. ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వలోని శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎంపీ గజానన్‌ కీర్తికర్.. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. దీంతో షిండే వర్గంలో చేరిన..

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రేకి షాక్.. షిండే వర్గంలో చేరిన మరో ఎంపీ..
Gajanan Kiritkar

Updated on: Nov 12, 2022 | 12:45 PM

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఆ పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు షాకిస్తున్నారు. తాజాగా మరో ఎంపీ పార్టీని విడారు. ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వలోని శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎంపీ గజానన్‌ కీర్తికర్.. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. దీంతో షిండే వర్గంలో చేరిన ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈనేపథ్యంలో ఆయనను థాక్రే శివసేన నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆపార్టీ ప్రకటించింది. శివసేనకు చెందిన 18 మంది ఎంపీలలో కీర్తికర్ ఒకరు. ఇప్పటికే శివసేన పార్టీకి 56 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40 మంది షిండే వర్గంలో ఉన్నారు. దీంతో బీజేపీ మద్దతుతో షిండే ముఖ్యమంత్రి బాధ్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ముంబైలో మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన మూడుచొప్పున గెలుపొందాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో శివసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇప్పటికే షిండే వర్గంలో చేరిపోయారు. ఇక మిగిలింది ఉద్ధవ్‌ వర్గంలో ఎంపీ అరవింద్ సావంత్ ఒక్కరే మిగిలిపోయారు.

ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో ఎంపీ, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న గజానన్ కీర్తికర్ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలవడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం మరింత బలహీనపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్‌నాధ్‌ షిండే, కీర్తికర్‌ కలిసి కనిపించారు. దీంతో ఇప్పటి వరకు ఠాక్రే వర్గం నుంచి పార్టీ మారిన ఎంపీల సంఖ్య 13కి చేరింది. ముగ్గురు రాజ్యసభ ఎంపీలతో ఉద్ధవ్ ఠాక్రేకు ప్రస్తుతం తొమ్మిది మంది ఎంపీలు మాత్రమే మిగిలారు.

గజానన్ కీర్తికర్ ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ నియోజకవ్గం నుంచి ఎంపీగా ఉన్నారు. 1995లో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా కూడా కీర్తికర్ పనిచేశారు. గజానన్ కీర్తికర్ గతంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీర్తికర్ ఇంటికి వెళ్లారు. అయితే గత కొన్ని రోజులుగా కీర్తికర్ ఠాక్రే వర్గంపై అసంతృప్తితో ఉన్నారు. కీర్తికర్ తన వర్గంలో చేరడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. సీనియర్ నాయకుడు గజానన్ కీర్తికర్ తమతో చేరడం సంతోషంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..