
భువనేశ్వర్‌లోని అతిపెద్ద రోజువారీ మార్కెట్ అయిన యూనిట్-I హాత్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 దుకాణాలు కాలిపోయాయి, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయి. అయితే ఈ సంఘటనలో ప్రాణనష్టం లేదా గాయాల గురించి ఎటువంటి నివేదికలు రాలేదు. కాగా ఎగసిపడిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి రెండు గంటలకు పైగా పట్టిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో ఒక కిరాణా దుకాణంలో ప్రారంభమైన మంటలు, మండే పదార్థాలు ఉండటం వల్ల సమీపంలోని దుకాణాలకు త్వరగా వ్యాపించాయని ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు.
మంటలను అదుపు చేయడానికి 11 ఫైర్ ఇంజన్లు, 140 మంది సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందిందని, ఐదు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. కాగా అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి