
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గాంజాను పట్టుకున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి ప్రవర్తణ అనుమానంగా కనిపించడంతో అతన్ని అడ్డుకొని లగేజీని తనిఖీ చేశారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. దీంతో అతను సూట్‌కేస్‌లో అక్రమంగా తరలిస్తున్న ఈ నిషేధిత మత్తు పదార్థాన్ని కనుగొన్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని తన బ్యాగేజ్‌లో ఉన్న సుమారు 3.93 కిలోల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గాంజా విలువు బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.3.93 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు. అంతర్జాతీయ స్థాయిలో ఖరీదైన ఈ డ్రగ్ రకాన్ని హైడ్రోపోనిక్ పద్ధతిలో పండిస్తున్నట్టు గుర్తించారు. అంటే మట్టిలేకుండా నీటి ఆధారిత పోషకాల ఆ గంజాను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ సీజ్ డ్రగ్ ముఠాల అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై కీలక ఆధారాలు బయటకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుడిని DRI అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అతడి నుండి మరిన్ని వివరాలు, డ్రగ్ మూలం, సరఫరా మార్గాలు, అనుబంధ వ్యక్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్ స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయ భద్రతా విభాగం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజ్ స్కానింగ్ మరింత కఠినతరం చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.