Bharat Bandh: నేడు, రేపు భారత్ బంద్.. ఈ సేవలకు అంతరాయంతో ప్రజలు ఇక్కట్లు..

|

Mar 28, 2022 | 10:51 AM

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక రెండు రోజుల బంద్‏కు (Bharath Bandh) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 28, 29 తేదీలలో

Bharat Bandh: నేడు, రేపు భారత్ బంద్.. ఈ సేవలకు అంతరాయంతో ప్రజలు ఇక్కట్లు..
Bharath Bhandh
Follow us on

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక రెండు రోజుల బంద్‏కు (Bharath Bandh) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 28, 29 తేదీలలో దేశవ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. అయితే కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‏కు ఇతర రంగాల కార్మికులు కూడా మద్దతు ఇస్తున్నారు. బ్యాంకింగ్.. భీమా, విద్యుత్ ఉద్యోగ సంఘాలు భారత్ బంద్‏కు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో సోమవారం, మంగళవారం పలు రంగాల సేవలలో అంతరాయం కలగనుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కలగవచ్చు. ఇప్పటికే బంద్ ప్రభావం కనిపిస్తుండడంతో అప్రమత్తమైన ఆయా విభాగాలు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తమ కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ ప్రభావం ఉండనుంది. ఈ రెండు రోజులు బ్యాంకులు అందుబాటులో ఉండవు. పూర్తిస్థాయిలో సోమ, మంగళ వారాల్లో బ్యాంకు సేవలు పూర్తిగా పనిచేయవని ఇప్పటికే ఎస్బీఐ తమ ఆయా బ్రాంచులకు సందేశాలు పంపించాయి.

బ్యాంకులతోపాటు.. టెలికాం.. పోస్టల్.. ఆదాయపన్ను, భీమా, చమురుతోపాటు ఇతర రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. అంతేకాకుండా.. రైల్వేలోని కొన్ని సంఘాలతోపాటు రోడ్డు, విద్యుత్, రవాణా కార్మికులు కూడా పాల్గొననుండడంతో ఈ సేవలలో అంతరాయం కలగనుంది. ఇప్పటికే అప్రమత్తమైన విద్యుత్ శాఖ జాతీయ గ్రిడ్ నిర్వహణతోపాటు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ విభాగాలను అలర్ట్ చేసింది. రైల్వే, రక్షణ కేంద్రాలకు నిరాంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ బంద్‏కు ఆయా రాష్ట్రాలు మద్దతు పలకగా.. తమిళనాడు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు మాత్రం ఉద్యోగులు భారత్ బంద్‏లో పాల్గొనకూడదని నిబంధనలు జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలు సోమ, మంగళవారాల్లో ఓపెన్ చేయనున్నట్ల ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ బంద్ కేవలం రాజకీయ ప్రేరేపితంగా భావిస్తున్నామని అందుకే దీనికి దూరంగా ఉంటున్నామని తెలిపింది బెంగాల్ ప్రభుత్వం.

Also Read: RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్టనర్లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..

Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..