
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న అంతర్జాతీయ సదస్సు భారత్ ఇన్నోవేట్స్ 2026 రెండో రోజు అద్భుతమైన రెస్పాన్స్‌తో ముగిసింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రీ లీడర్లు, రీసెర్చర్లు, స్టార్టప్స్, విద్యాసంస్థల మధ్య జరిగిన విస్తృత చర్చలు.. భారతదేశ డీప్‌టెక్ ఇన్నోవేషన్ల వాణిజ్యీకరణను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. సదస్సు ప్రారంభంలో దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, దేశీయ స్టార్టప్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించారు. బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, ఎనర్జీ, మొబిలిటీ, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో భారతీయ ప్రతిభను చూసి గ్లోబల్ లీడర్స్ ఫిదా అయ్యారు. ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ కో-ప్రోమోటర్, ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ జలజ్ దాని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాస్త్రీయ ఆవిష్కరణలను మార్కెట్ డిమాండ్, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేయడమే అసలైన విజయమని తెలిపారు.
బయో-ఇన్నోవేషన్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్ అండ్ డిఫెన్స్ సప్లై చైన్స్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై జరిగిన ప్యానెల్ చర్చల్లో అంతర్జాతీయ దిగ్గజాలు పాల్గొన్నారు. ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ ప్రొఫెసర్ చేతన్ చిట్నిస్, సాఫ్రాన్ రియోస్ సీఈఓ ఆరేలి గిరౌ, థేల్స్ అలెనియా స్పేస్‌కు చెందిన బెర్ట్రాండ్ డెనిస్, గిఫాస్ సీఈఓ ఫ్రెడరిక్ పారిసోట్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్ ప్రతినిధి యోకో ఫుకతా, మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్‌కు చెందిన సునీల్ బక్షి వంటి ప్రముఖులు తమ విలువైన విశ్లేషణలను పంచుకున్నారు.
రెండో రోజు సదస్సులో ఇన్వెస్టర్ స్టార్టప్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ హైలైట్‌గా నిలిచింది. 80కి పైగా భారత్ ఇన్నోవేట్స్ డీప్‌టెక్ స్టార్టప్స్ తమ ఆవిష్కరణలను పిచ్ చేశాయి. 10 కంటే ఎక్కువ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఈ పిచ్చింగ్ సెషన్లలో పాల్గొన్నారు. స్పేస్ డిఫెన్స్, AI-సెమీకండక్టర్స్, హెల్త్‌కేర్-మెడ్‌టెక్, బయోటెక్-అగ్రిటెక్, ఎనర్జీ-క్లైమేట్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి 6 ప్రత్యేక థీమాటిక్ రూమ్స్‌లో ఈ పిచ్చింగ్స్ జరిగాయి. వీటి ద్వారా 40 కి పైగా స్టార్టప్స్ గ్లోబల్ వెంచర్ ఫండ్స్ నుండి తదుపరి పెట్టుబడి హామీలను సాధించాయి.
భారత్, యూరప్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్ల మధ్య సరికొత్త టెక్నాలజీ డీల్స్‌కు ఈ సదస్సు ఒక కెటలిస్ట్‌లా నిలిచింది. ఇక మూడో రోజున టెక్నాలజీ పార్కులు, యాక్సిలరేటర్లు, క్లైమేట్ టెక్నాలజీస్, పారిశ్రామిక డీకార్బనైజేషన్, గ్లోబల్ స్కేలింగ్ వ్యూహాలు, దీర్ఘకాలిక సంస్థాగత భాగస్వామ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సు ద్వారా గ్లోబల్ డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్‌గా భారతదేశం తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గ్లోబల్ క్యాపిటల్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్టీస్‌ను ఇండియన్ మైండ్స్‌తో లింక్ చేయడంలో ఈ సదస్సు వంద శాతం సక్సెస్ అయిందని చెప్పవచ్చు.