బెంగళూరు ఘర్షణలు.. విధ్వంసకారులే నష్టపరిహారం చెల్లించాలి

| Edited By:

Aug 12, 2020 | 10:52 PM

మంగళవారం రాత్రి బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణల గురించి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కారణంగా అక్కడ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో వందల..

బెంగళూరు ఘర్షణలు.. విధ్వంసకారులే నష్టపరిహారం చెల్లించాలి
Follow us on

మంగళవారం రాత్రి బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణల గురించి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కారణంగా అక్కడ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో వందల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. అంతేకాదు.. పోలీస్ స్టేషన్‌పై కూడా దాడికి దిగి.. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో.. ఆందోళన కారులపై కాల్పులు చేపట్టడంతో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు ఆందోళనకారుల దాడిలో అరవై మంది పోలీసులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అటు కర్ణాటక హోం మంత్రి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసినవారే.. వాటి నష్టపరిహారం చెల్లించాలన్నారు.

ఆస్తులను ధ్వంసం చేసినవారిని.. సీసీ ఫుటేజీల ద్వారా గుర్తిస్తున్నామని.. నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి, ఆందోళనకారులే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే