AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తకు విడాకులిచ్చి.. స్కూల్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది! కట్‌ చేస్తే.. తన ఇంట్లోనే ఉరేసుకుంది!

కేజీ హళ్ళి పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ నాగరాజ్ భార్య షాలిని, బెంగళూరులోని హెచ్‌బిఆర్ లేఅవుట్‌లోని తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. షాలిని తన భర్తపై మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. పెళ్లయ్యాక కూడా భర్తతో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తకు విడాకులిచ్చి.. స్కూల్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది! కట్‌ చేస్తే.. తన ఇంట్లోనే ఉరేసుకుంది!
Shalini
SN Pasha
|

Updated on: May 20, 2025 | 5:57 PM

Share

బెంగళూరులోని హెచ్‌బిఆర్ లేఅవుట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేజీ హళ్లి పీఎస్‌ఐ నాగరాజ్‌ భార్య షాలిని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి హెచ్‌బిఆర్ లేఅవుట్‌లోని తన ఇంట్లో షాలిని బలవన్మరణానికి పాల్పడింది. కేజీలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నాగరాజ్‌ను వివాహం చేసుకోవడానికి షాలిని తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. హైస్కూల్‌ ఫ్రెండ్‌ను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ షాలినా ఆత్మహత్య ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతులు షాలిని, పీఎస్‌ఐ నాగరాజ్‌లు ఇలకల్‌కు చెందిన వారు. వారు హైస్కూల్లో ట్యూషన్ ఫ్రెండ్స్‌. తర్వాత షాలిని ఎంఎస్సీ, నాగరాజ్ ఇంజినీరింగ్ చదివారు. నాగరాజ్ బెంగళూరులో PSI పరీక్షకు సిద్ధమయ్యాడు.

అదే సమయంలో షాలిని బెంగళూరులోని ఒక ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తోంది. PSI పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో షాలిని అతనికి ఆర్థిక సహాయం కూడా అందించింది. ఈ విధంగా కొనసాగుతూ.. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత షాలిని తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, నాగరాజ్‌ను రెండవసారి వివాహం చేసుకుంది. మృతురాలు షాలినికి ప్రస్తుతం 7 ఏళ్ల పాప ఉంది. 2020లో PSI పరీక్షలో ఉత్తీర్ణుడైన నాగరాజ్, షాలినిని వదిలించుకోవాలని ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ, నాగరాజ్ పై కోననకుంటె పోలీస్ స్టేషన్‌లో షాలిని ఫిర్యాదు చేసింది. సీనియర్ అధికారులు వారి సమస్యను పరిష్కరించారు.

తరువాత కుటుంబం నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ నాగరాజ్ ఆమెను ఆగస్టు 2024లో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ HBR లేఅవుట్‌లో కాపురం ఉంటున్నారు. కానీ గత రెండు నెలలుగా షాలిని, నాగరాజ్ మధ్య విభేదాలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీనితో నాగరాజ్ వేరే చోట ఉంటున్నట్లు సమాచారం. తన భర్త ఇంటికి రాకపోవడంతో కోపంగా ఉన్న షాలిని, నిన్న రాత్రి ఫోన్ చేసి, రైలు కింద చనిపోతానంటూ నాగరాజ్‌కు ఫోన్‌ చేసి చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమెను హొయసల గార్డులు రక్షించి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి గోవింద్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భార్య ఆత్మహత్య నేపథ్యంలో ప్రస్తుతం పిఎస్‌ఐ నాగరాజ్‌ను సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ