Thief made his Honda City car as Home: తెలివంటే ఈ దొంగదే అనాలి. సినిమాలను బాగా ఫాలో అవుతాడేమో. దొంగతనాలకు పాల్పడుతూ ఒకే చోట నివాసముంటే దొరికిపోతానని భావించాడేమో. అందుకే కొత్తగా ఆలోచించి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు.కారునే ఇల్లుగా మార్చుకుని దాదాపు వందకుపైగా చోరీలకు పాల్పడ్డాడు. ఆపై పోలీసులకు పట్టుబడకుండా నిరంతరం ప్రయాణం సాగిస్తుండేవాడు. కానీ అతని బ్యాడ్ లక్.. ఎట్టకేలకు ఆ ఘరానా దొంగ ఆటకట్టించారు పోలీసులు.
ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. మంగళవారం నాడు బెంగళూరు సిటీ పోలీసులు ఓ దొంగను అరెస్ట్ చేశారు. దాదాపు వందకు పైగా చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టైన నిందితుడు దాదాపు 100కు పైగా చోరీలకు పాల్పడ్డాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతని వద్ద ఉన్న హోండా సిటీ కారునే ఇల్లుగా మార్చుకున్నాడు. అలా ఒక చోట దొంగతనం చేసిన అనంతరం మరో ప్రాంతానికి మకాం మార్చేవాడు. ఎలాగూ నివాసం కూడా కారులోనే ఉండటంతో నిరంతరం ట్రావెల్ చేస్తూనే ఉండేవాడు. అయితే రోజూ వారి విధుల్లో భాగంగా బెంగళూరు పోలీసులు తనిఖీలు చేయగా.. ఈ ఘరానా దొంగ అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
పవన్‌పై ఏపీ మంత్రుల ముప్పేట దాడి.. బోడిలింగం ఎవరో గాజువాక, భీమవరం వెళితే చెబుతారంటూ సెటైర్లు..