
ఈ తరం యువత రోజురోజుకూ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా బెంగళూరు నగరంలో జరిగిన ఓ సంఘటన యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ యువతి తన తల్లికి తెలియకుండా ఆమె ప్రైవేట్ ఫోటోలను తీసి తన ప్రియుడికి పంపించింది. విషయం తెలుసుకున్న సదురు మహిళ కుమార్తెతో పాటు ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో నగరంలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అయితే స్టడీస్ కోసం తనకు మొబైల్ అవసరమని కుమార్తె చెప్పడంతో చెప్పడంతో ఇటీవలే తల్లిదండ్రులు ఆమెకు కొత్త మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే సుమారు నెల రోజుల క్రితం కుమార్తె ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు కుటుంబ సభ్యులు గమనించారు. అనుమానం రావడంతో తల్లి కుమార్తె ఫోన్‌ను పరిశీలించగా.. అందుతో తన ప్రైవేట్ ఫొటోలతో పాటు మరో మహిళా బంధువు నగ్న ఫొటోలు కనిపించాయి. అవి చూపి తాను షాకయ్యానని తల్లి ఫిర్యాదుతో పేర్కొంది.
ఈ ఫొటోలు తమకు తెలియకుండా తీసినవేనని.. ఈ ఫొటోలను కుమార్తే తనతో పరిచయం ఉన్న వ్యక్తికి కూడా పంపిందని తల్లి ఆరోపించింది. అంతేకాదు తమకు తెలియకుండా కొద్ది వారాల క్రితమే ఆ వ్యక్తిని తమ కుమార్తె వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కుమార్తెతో పాటు ఆమె ప్రియుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు స్పష్టమవుతాయని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.