తల్లిదండ్రులు మందలించారని.. 11వ అంతస్తు నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్ధిని.. స్పాట్ డెడ్

|

Feb 27, 2023 | 10:35 AM

తల్లిదండ్రులు మందలించాని మనస్తాపం చెందిన ఇంటర్‌ విద్యార్ధిని అపార్ట్‌మెంట్‌ భవనలోని 11వ అంతస్తు నుంచి కిందికి దూకి  ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తల్లిదండ్రులు మందలించారని.. 11వ అంతస్తు నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్ధిని.. స్పాట్ డెడ్
Bengaluru Crime News
Follow us on

తల్లిదండ్రులు మందలించాని మనస్తాపం చెందిన ఇంటర్‌ విద్యార్ధిని అపార్ట్‌మెంట్‌ భవనలోని 11వ అంతస్తు నుంచి కిందికి దూకి  ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవినాష్ కుమార్తె ప్రకృతి (18) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. ప్రకృతి గత కొంత కాలంగా తల్లిదండ్రులతో గొడవపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు కూడా తల్లిదండ్రులతో ఘర్షణ పడి రూ. 300 నగదు తీసుకుని ఇంటి నుంచి కోపంగా వెళ్లిపోయింది. అనంతరం తమ నివాసానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోఫియా హైస్కూల్‌కు కాలినడకన చేరుకుంది. ఐతే సెక్యురిటీ గార్డు ఆమెను లోపలికి అనుమతించలేదు. తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో బసవేశ్వర సర్కిల్‌లో ఉన్న హై పాయింట్ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించింది. సెక్యూరిటీ గార్డుకు కనబడకుండా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలలో కనిపించింది.

లిఫ్ట్‌ ద్వారా 11వ అంతస్తుకు చేరుకని అక్కడి నుంచి కిందికి దూకేసింది. పార్కింగ్‌లో ఉన్న రెడ్ హ్యాచ్‌బ్యాక్ కారుపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతురాలి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ప్రకృతి గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోందని, కుటుంబంతో గొడవలు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.