AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పిల్లల్ని సన్‌రూఫ్‌ ఎక్కిస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఎంత ప్రమాదమో ఇక్కడ చూడండి!

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కారులోని సన్‌రూఫ్ ఓపెన్‌ చేసుకొని సిటీ వ్యూవ్‌ను చూస్తున్న ఓ బాలుడి తలకు హెవీ వెహికల్స్‌ కంట్రోల్‌ బారియర్‌ తగిలింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వెనకాల వస్తున్న కారు డ్యాష్‌ క్యామ్‌లో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైలర్‌గా మారాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పిల్లల్ని సన్‌రూఫ్‌ ఓపెన్‌ చేసి తిప్పడం ఎంత ప్రమాదమో తెలసుకుంటున్నారు.

Watch Video: పిల్లల్ని సన్‌రూఫ్‌ ఎక్కిస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఎంత ప్రమాదమో ఇక్కడ చూడండి!
Bengaluru Viral Video
Anand T
|

Updated on: Sep 07, 2025 | 8:08 PM

Share

మనం సరదా కోసం చేసే పనులు కొన్ని సార్లు క్షణాల్లో ప్రాణాతకంగా మారుతాయని చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఒక ఘటన బెస్ట్‌ ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే కారులో ప్రయాణించేప్పుడు సన్‌రూఫ్‌ నుంచి బయటకు రావడం కూడా ఎంత ప్రమాదమో తెలియజేస్తుంది. ఇంతకు విషయం ఏమిటంటే.. బెంగళూరుకు చెందిన ఒక బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో సిటీ అందాలును చూసేందుకు ఆ బాలుడు కారు సన్‌రూఫ్‌ ఓపెన్‌ బయటకు వచ్చాడు. ఇంతలో రోడ్డుపై ఏర్పాటు చేసిన హెవీ వెహికల్స్‌ కంట్రోల్‌ బారియర్‌ రావడంతో సడెన్‌గా దానికి తగిలి కారులో పడిపోయాడు.

ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనదారులు వాళ్ల కారును ఆపడంతో వెంటనే బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం వెనకాల వస్తున్న కార్లోని డ్యాష్‌ కామ్‌లో రికార్డయ్యాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెజిటన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత

ఈ సంఘటన కారు వెళ్లేప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత, డ్రైవర్ అవగాహనపై తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రయాణించేప్పుడు ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కారు సన్‌రూప్‌లను ఎలాంటి అడ్డంకులు లేని హైవేలపై మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.