జపనీస్ వెబ్‌ సిరీస్ చూసి గదిలోకి వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మొబైల్ గేమ్‌లు, వెబ్ సిరీస్‌లు.. పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి.. అదే పనిగా ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూడటం.. అలాగే.. గేమ్‌లు ఆడటం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వెబ్ సిరీస్ కు బానిసైన పిల్లాడు.. ఆత్మహత్య చేసుకుని మరణించడం సంచలనంగా మారింది.. బెంగళూరులో గాంధార్‌ (14) అనే బాలుడు ఆత్మహత్యకు జపనీస్‌ వెబ్‌ సిరీస్‌ కారణమని పోలీసులు తేల్చడంతో అంతా షాకయ్యారు.

జపనీస్ వెబ్‌ సిరీస్ చూసి గదిలోకి వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Bengaluru Boy Dies

Updated on: Aug 09, 2025 | 12:42 PM

మొబైల్ గేమ్‌లు, వెబ్ సిరీస్‌లు.. పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి.. అదే పనిగా ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూడటం.. అలాగే.. గేమ్‌లు ఆడటం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వెబ్ సిరీస్ కు బానిసైన పిల్లాడు.. ఆత్మహత్య చేసుకుని మరణించడం సంచలనంగా మారింది.. బెంగళూరులో గాంధార్‌ (14) అనే బాలుడు ఆత్మహత్యకు జపనీస్‌ వెబ్‌ సిరీస్‌ కారణమని పోలీసులు తేల్చడంతో అంతా షాకయ్యారు. ఈ సంఘటన బెంగళూరు CK అచ్చుకట్టు ప్రాంతంలో జరిగింది.. పిల్లలు డార్క్ ఆన్‌లైన్ కంటెంట్‌కు గురికావడంపై కొత్త ఆందోళనలను లేవనెత్తింది. వివరాల ప్రకారం.. ఆగస్టు 3 రాత్రి బెంగళూరుకు చెందిన 7వ తరగతి బాలుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.. సోమవారం రాత్రి భోజనం చేసి గాంధార్.. తమ పెంపుడుకుక్క రాకీతో కాసేపు ఆడుకుని గదిలోకి వెళ్లాడు. అనంతరం విగతజీవిగా కనిపించాడు.. అయితే.. ఆత్మహత్యకు ముందు గాంధార్ లేఖ రాశాడు.. ‘‘మీరు నన్ను 14 ఏళ్లు చక్కగా పెంచారు. మీతో నేను కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా..’’ అంటూ సూసైడ్ నోట్ లో రాశాడు.

బాగా చదవడంతోపాటు.. అందరితో మంచిగా ఉండే గాందార్ ఇలా రాయడం పోలీసులను ఆశ్చర్యపరచింది. తాను చూసిన జపనీస్ అనిమే సిరీస్‌లోని ఒక పాత్రధారి బొమ్మను గాంధార్‌ తన గదిలో గోడపై గీశాడు. అయితే.. అది ఆ సిరీస్‌లో ఒక మాయా పుస్తకంలోని హీరో పాత్రధారి.. చెడ్డవాళ్లు చనిపోవాలని వాళ్ల పేరు రాస్తే.. అలాగే జరుగుతుంది. నిత్యం ఆ సిరీస్‌ మాత్రమే చూసే గాంధార్‌ దాని ప్రభావంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

ఈ ఆత్మహత్యకు జపనీస్ అనిమే వెబ్ సిరీస్ డెత్ నోట్‌తో దీనికి సంబంధం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బాలుడి మరణానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అధికారులు వివరణాత్మక విషయాలను వెల్లడించారు. బాలుడి గదిని ప్రాథమికంగా తనిఖీ చేస్తున్నప్పుడు, పరిశోధకులు సిరీస్‌లోని ఒక పాత్ర డ్రాయింగ్‌ను కనుగొన్నారు. ఈ వివరాలు షో ఇతివృత్తాలు బాలుడి చర్యలను ప్రభావితం చేసి ఉండవచ్చో లేదో పరిశీలించడానికి పోలీసులను ప్రేరేపించాయి.
అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఇటీవలి ఆన్‌లైన్ కార్యకలాపాలను తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతని కుటుంబం – పాఠశాల అధికారులతో కూడా మాట్లాడారు.. ఆ బాలుడిలో ఎలాంటి బాధ సంకేతాలు కనిపించలేదని, ఇంట్లో లేదా పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేవని తల్లిదండ్రులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..