ఈ మధ్య ర్యాపిడో, జొమాటో డెలివరీ బాయ్స్ మీద దాడి జరుగుతున్న ఘటనల సంఖ్య బాగా పెరిగిపోయింది. డెలివరీ తెచ్చి ఇచ్చినవారికి టిప్‌గా కనీసం రూపాయి అయినా ఇవకపోయినా పర్వాలేదు, కానీ వారిని సాటి మనిషిగా అయినా గౌరవించాలి కదా..! కానీ అందుకు విరుద్ధంగా కొందరు ప్రబుధ్దులు.. డెలివరీ లేట్ అయిందని, తెచ్చిన ఫుడ్ ఐటమ్ చల్లబడిపోయిందంటూ ఏవేవో కారణాలతో వారిపై భౌతిక దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరులో జరిగిన మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇందిరా నగర్‌లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగగా, మార్చి 5న వీడియో రూపంలో నెట్టింట ప్రత్యక్షమయింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు.
ఇక వైరల్‌గా మారిన ఆ వీడియోలో రాపిడో డెలివరీ బాయ్‌తో ఒక ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనకు ముందు ఏం జరిగిందో తెలియరాలేదు కానీ డెలివరీ బాయ్ బైక్ తాళాలు లాక్కొని, అతను తెచ్చిన డెలివరీని నేలకేసి కొట్టాడు సదరు ఆటో డ్రైవర్. అంతేకాక డెలివరీ బాయ్ మీద చేజేసుకోబోయాడు కూడా. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో freedom of speech B,lore అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. దీంతో రంగంలోకి దిగిన బెంగళూరు నగర పోలీసు విభాగం ‘ఇందిరా నగర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామ’ని ట్విట్టర్ ద్వారా సదరు వీడియోకు రిప్లై ఇచ్చారు.
Strict action should be taken against this auto driver under the law.
Is there no such thing as law in Bangalore City?@BlrCityPolice @BlrCityPolice @CPBlr @tv9kannada pic.twitter.com/Uaa4Am9OPV— freedom of speech B,lore (@freedomlore1) March 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.