Bengaluru: బెంగళూరు నగరంలో కనిపించకుండా పోయిన ఆరువేల మంది కరోనా పేషంట్లు

| Edited By: Anil kumar poka

May 10, 2021 | 10:05 AM

అసలే కరోనా సెకండ్‌వేవ్‌ ధాటికి భయాందోళనలకు గురవుతుంటే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు తిన్నగా ఐసోలేషన్‌లో ఉండక ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు..

Bengaluru: బెంగళూరు నగరంలో కనిపించకుండా పోయిన ఆరువేల మంది కరోనా పేషంట్లు
Covid 2
Follow us on

Bengaluru:  అసలే కరోనా సెకండ్‌వేవ్‌ ధాటికి భయాందోళనలకు గురవుతుంటే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు తిన్నగా ఐసోలేషన్‌లో ఉండక ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు.. కర్నాటక రాజధాని బెంగళూరులో అయితే చదువుకున్నవారు కూడా ఈ పని చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు కొన్ని వేల మంది అదృశ్యమయ్యారట. అదృశ్యమంటే కనిపించకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారన్న మాట! బెంగళూరులో సుమారు ఆరు వేల మంది కరోనా పేషంట్లు కనిపించకుండా పోవడంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇంతకు ముందు కూడా ఓ పది వేల మంది కనిపించకుండా పోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు మళ్లీ ఆరు వేల మంది ఇలా అదృశ్యం కావడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. కరోనా పరీక్షలకు వచ్చినవారు తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ఛాఫ్‌ చేసి పెట్టుకున్నారట! పాజిటివ్‌ వచ్చిన విషయం కూడా వారికి తెలియదు. ఇలా తప్పించుకుని తిరుగుతున్నవారిని వెతకడం పోలీసులకు తలకు మించిన భారమవుతుంది. ఇలాంటి బాపతుగాళ్ల మూర్ఖపు చర్య కారణంగానే కరోనా వేగంగా విస్తరిస్తోంది..

ఇదిలా ఉంటే సోమవారం నుంచి కర్నాటకలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతున్నది. దాంతో ముందుజాగ్రత్తగా చాలా మంది బెంగళూరు నగరాన్ని వదిలేసి తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. అసలు జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచే బెంగళూరుకు పొట్టకూటి కోసం వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో పాటు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు మూతపడటంతో బెంగళూరులో ఉండటం కష్టమవుతుందన్న భావనతో చాలా మంది నగరం వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు కిటకిటలాడాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :  Thank You Brother: ఓటీటీలో కూడా తగ్గని జబర్ధస్ అనసూయ హవా .. ( వీడియో )
Viral Video: భార్య,అమ్మ నగలు తాకట్టు పెట్టి.. కొవిడ్‌ ఆస్పత్రి.. నెట్టింట వైరల్… ( వీడియో )