
దీపావళి పండుగరోజు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది.నగరంలోని జీటీమాట్‌లోని మూడో అంతస్తు నుంచి పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు పడిందా అని తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు మృతుడి వివరాలను మాత్రం పోలీసులు నిర్ధారించలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.బెంగళూరులోని మాగడి రోడ్డులో ఉన్న జిటి మాల్‌ను ఉదయం సిబ్బంది ఓపెన్ చేసేందుకు వచ్చినప్పుడు ఈ ప్రమాదాన్ని గుర్తించనట్టు తెలిపారు.అది చూసి భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్‌ను సమాచారం అందించినట్టు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సీజ్ చేశారు. మాల్‌ను కూడా క్లోజ్ చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Man Dies After Falling from Third Floor of GT Mall on Magadi Road; Police Investigate
The incident took place at GT Mall on Magadi Road, where a man reportedly fell from the third floor of the building. He is said to have sustained severe head injuries and died on the spot.
It… pic.twitter.com/8gi5tfgdPh— Karnataka Portfolio (@karnatakaportf) October 20, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.