పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం మెమో! దీదీకి షాక్ !
పశ్చిమబెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో మమత సర్కార్ దాదాపు విఫలమైనట్టు పేర్కొంటూ కేంద్ర హోమ్ శాఖ ఓ మెమో జారీ చేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉల్లంఘనలు యథేఛ్చగా జరిగాయని, పోలీసుల మీద, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఈ మెమోలో ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా మరణాల రేటు ఇతర రాష్ట్రాల కన్నా […]

పశ్చిమబెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో మమత సర్కార్ దాదాపు విఫలమైనట్టు పేర్కొంటూ కేంద్ర హోమ్ శాఖ ఓ మెమో జారీ చేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉల్లంఘనలు యథేఛ్చగా జరిగాయని, పోలీసుల మీద, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఈ మెమోలో ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా మరణాల రేటు ఇతర రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువగా ఉందని, 13.2 శాతం ఉందన్న విషయం స్పష్టమైందని ఇందులో విమర్శించారు. అసలే గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి, దీదీకి మధ్య భేదాభిప్రాయాలు మరింత రేగుతున్న ఈ తరుణంలో ఈ మెమో పట్ల మమత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.