బెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయన ఇటు తమ రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య నలుగుతున్నారు. ఆయనను తిరిగి కేంద్రానికి డెప్యూట్ చేయాలన్న ఆదేశాలను తుంగలో తొక్కిన సీఎం మమతా బెనర్జీ..నిన్న వెంటనే ఆయన చేత రాజీనామా చేయించి.. మూడేళ్ళ పాటు తన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. దీంతో ఆయన బెంగాల్ లోనే సెటిల్ అయిపోగా..కేంద్రం నుంచి ఆయనకు షో కాజ్ నోటీసు అందింది. యాస్ తుఫానుపై ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు గైర్ హాజరయ్యారో వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో ఆదేశించారు. దీనికి మూడు రోజుల్లోగా సమాధానమివ్వాలని కూడా కోరారు. మోదీ నిర్వహించిన మీటింగ్ కి సీఎం మమత గైర్ హాజరయిన విషయం తెలిసిందే. తమ ఐఏఎస్ అధికారిని ఎందుకు పిలుస్తన్నారని మమతా బెనర్జీ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా రాజకీయ క్షక్ష అని ఆరోపించారు.(గత శుక్రవారం ఆమెతో కలిసి వచ్చిన బందోపాధ్యాయ..మోదీ మీటింగ్ లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు). ఇది కేంద్ర ఆదేశాలను ధిక్కరించడమే అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే చట్టం ప్రకారం ఈ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసి ఉండగా అలా జరగలేదు. పైగా ఈ కేసులో రివ్యూ మీటింగ్ కి రాకుండా ఈయన నిరాకరించాడని ఈ నోటీసులో ఆరోపించారు.
ఇప్పుడు ఈ అధికారి విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట సమ్మతమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులను కేంద్రం రీకాల్ చేసే హక్కు ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccine: మిక్స్ంగ్ టీకా.. కేంద్రం సరికొత్త వ్యాక్సిన్ ప్లాన్.. ఇవిగో వివరాలు