బెంగాల్ లో బీజేపీ నేత కాల్చివేత, 12 గంటల బంద్ కు పిలుపు

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేతనొకరిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కోల్ కతా కు సుమారు 20 కి.మీ. దూరంలోని బరక్ పూర్ లో మనీష్ శుక్లా అనే బీజేపీ నేత నిన్న సాయంత్రం తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైక్ పై వచ్చిన కొందరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు.

బెంగాల్ లో బీజేపీ నేత కాల్చివేత, 12 గంటల బంద్ కు పిలుపు

Edited By:

Updated on: Oct 05, 2020 | 10:51 AM

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేతనొకరిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కోల్ కతా కు సుమారు 20 కి.మీ. దూరంలోని బరక్ పూర్ లో మనీష్ శుక్లా అనే బీజేపీ నేత నిన్న సాయంత్రం తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైక్ పై వచ్చిన కొందరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మనీష్ శుక్లా ఆసుపత్రిలో మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్న బీజేపీ..దీనికి నిరసనగా సోమవారం 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ హత్యను గవర్నర్ జగదీప్ ధన్ కర్ తీవ్రంగా ఖండిస్తూ గత రాత్రి ట్వీట్ చేశారు. డీజీపీని, హోమ్ కార్యదర్శిని రాజ్ భవన్ కు రావలసిందిగా ఆదేశించారు. అటు బరక్ పూర్ లో పోలీసు స్టేషన్ ను ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తలు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.