కర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా బుధవారం ఉదయం 11 గంటలకు బసవరాజు బొమ్మై అను నేను అంటూ.. ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప బసవరాజ్ బొమ్మయ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదిలావుంటే.. మంగళవారం బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకున్న విషయం తెలిసిందే.
అనేక ఊహాగానాల మధ్య ఆయనకే సీఎం పీఠం దక్కింది. క్లిష్ట పరిస్థితుల్లో తనపై నమ్మకం ఉంచి.. బాధ్యతలు అప్పగించిన పార్టీకి బసవరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. తనకి ఈ పదవి వస్తుందని ఊహించలేదన్నారు. సీఎం పదవి నుంచి దిగిపోయినప్పటికీ.. యడియూరప్ప తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాను సూచించిన వ్యక్తికే సీఎం పీఠం దక్కేలా లైన్ క్లియర్ చేసుకున్నారు. యడియూరప్పకు నమ్మకస్తుడిగా బొమ్మైకి గుర్తింపు ఉంది.
Basavaraj Bommai sworn-in as the new Chief Minister of Karnataka pic.twitter.com/4RPPysdQBa
— ANI (@ANI) July 28, 2021