Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!

|

Dec 27, 2021 | 6:13 PM

Bank Holidays January 2022: ఈ ఏడాది ముగిసి 2022 సంవత్సరంలోకి అడుగు పెట్టుబోతున్నాము. ఇక ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకు ఖాతాలకు సంబంధించి లావాదేవీలు..

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!
Follow us on

Bank Holidays January 2022: ఈ ఏడాది ముగిసి 2022 సంవత్సరంలోకి అడుగు పెట్టుబోతున్నాము. ఇక ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకు ఖాతాలకు సంబంధించి లావాదేవీలు జరుపుతుంటారు. ప్రతి రోజు ఎంతో మంది బ్యాంకు పనుల నిమిత్తం ఆయా బ్రాంచ్‌లకు వెళ్తూ తమతమ లావాదేవీలకు సంబంధించిన పనులను చేసుకుంటారు. ఇక 2022 జనవరి నెలలో బ్యాంకుల పని దినాలు తగ్గిపోనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పలు రాష్ట్రాల్లో సెలవుల కారణంగా జనవరి నెల మొత్తంలో 16 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సైతం సెలవులు ప్రకటించాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సెలవులు మినహా, దేశ వ్యాప్తంగా బ్యాంకు సెలవులు ఒకే విధంగా ఉంటాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, ఇతర జాతీయ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవేకాకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. మరికొన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. మరి 2022 ఏడాదిలో జనవరి నెలలో బ్యాంకుల సెలవులను తెలుసుకుందాం.

2022 జనవరిలో బ్యాంకులకు సెలవులు:
జనవరి 1న కొత్త సంవత్సరం తర్వాత ఆదివారం
జనవరి 4: లోసూంగ్ (సిక్కిం), ఇది జాతీయ సెలవు కాదు
జనవరి 8: రెండో శనివారం
జనవరి 11: మిషనరీ డే (మిజోరం) ఇది జాతీయ సెలవు కాదు
జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు
జనవరి 14: మకర సంక్రాంతి/పొంగల్
జనవరి 15: సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి
జనవరి 18: తాయ్ పూసం (చెన్నై)
జనవరి 22: నాలుగో శనివారం
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
జనవరి 31, 2022: మీ-డ్యామ్-మీ-ఫై (అస్సాం) జాతీయ సెలవు కాదు
అయితే జనవరి 2, 9, 16,23,30వ తేదీల్లో ఆదివారం. కాబట్టి ఆ రోజు బ్యాంకులు యధావిధిగా మూసి ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Chicken Biryani: ఈ ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీ.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..!

Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-9 బైక్‌లు ఇవే..!