
ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేం కొత్త కాదు. మొన్నటికి మొన్న.. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకు ముగిసిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పిక్చర్ అభి బాకీ హై’ అంటూ కామెంట్లు చేయడం వివాదాస్పదంగా మారింది. హుమాయున్ కబీర్ నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో డిసెంబర్ 22న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కబీర్ వెల్లడించారు.
ఈ రాజకీయ పరిణామాల నడుమ తాజాగా కబీర్ బాబ్రీ మసీదు వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. బాబ్రీ మసీదు విరాళాలకు సంబంధించి నిధులు ఒక్క రోజులోనే హుమాయున్ ఇంట్లో పేరుకుపోయినట్లు తెలుపుతున్నట్లు ఉన్న ఓ వీడియోని హుమాయున్ కబీర్ తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తం 11 ట్రంక్‌ల విరాళాలు సేకరించినట్లు హుమాయున్ కబీర్ ఈ సందర్భంగా తెలిపారు. QR కోడ్ ద్వారా అతని బ్యాంకు ఖాతాలో రూ.9.3 మిలియన్లు జమ చేసినట్లు.. అందుకోసం డబ్బును లెక్కించడానికి ముప్పై మందిని నియమించడానికి లెక్కింపు యంత్రాన్ని కూడా ఆ వీడియోలో చూపించారు.
బీజేపీ నుంచి వచ్చిన నిధులతోనే తాను ఈ మసీదును నిర్మిస్తున్నానని అందరూ మాట్లాడుతున్నారని, అది అబద్ధం అని నిరూపించడానికే తన ఈ ప్రత్యక్ష వీడియో నిదర్శనమని హుమాయున్ చెప్పడం గమనార్హం. డబ్బు లెక్కింపు ప్రక్రియ సీసీటీవీ పర్యవేక్షణలో జరుగుతుందని, తన బాబ్రీ మసీదును విరాళంగా వచ్చిన డబ్బుతోనే నిర్మిస్తామని హుమాయున్ కబీర్ వెల్లడించారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.